అన్వేషించండి

Vivo T3 5G: వివో టీ3 5జీ లాంచ్ వచ్చే వారమే - బడ్జెట్ ధరలోనే 5జీ, 50 మెగాపిక్సెల్ కెమెరా!

Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మనదేశంలో వివో టీ3 5జీని లాంచ్ చేయనుంది. వచ్చే వారమే ఈ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది.

Vivo T3 5G India Launch: వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో వచ్చే వారం లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్‌ను టీజ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్‌పై వివో టీ3 5జీ పని చేయనుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ అందుబాటులో ఉంది. గతంలో లాంచ్ అయిన వివో టీ2కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.

మార్చి 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వివో టీ3 5జీ పని చేయనుంది. వివో దీనికి సంబంధించిన మీడియా ఇన్వైట్‌ను కూడా విడుదల చేసింది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకమైన మైక్రో సైట్‌ను కూడా క్రియేట్ చేసింది. దీని డిజైన్, స్పెసిఫికేషన్లను కాస్త రివీల్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వివో ప్రకటించింది. కానీ ఏ ప్రాసెసర్ అన్నది తెలపలేదు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అని వార్తలు వస్తున్నాయి.

బ్లూ షేడ్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇందులో చూడవచ్చు. కెమెరా యూనిట్‌లో ఒక సోనీ సెన్సార్ అందించనున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను వివో ఈ ఫోన్‌లో అందించనుంది. దీని ధర మనదేశంలో రూ.20 వేల లోపే ఉండనుంది. క్రిస్టల్ ఫ్లేక్, కాస్మిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

గతంలో వచ్చిన లీకుల ప్రకారం... వివో టీ3 5జీలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1800 నిట్స్‌గా ఉండనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.

ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 లెన్స్, 2 మెగాపిక్సెల్ బొకే లెన్స్, ఫ్లికర్ సెన్సార్ ఉండనున్నాయని తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఐపీ54 రేటెడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ బిల్డ్‌తో వివో టీ3 5జీ రానుందట.

మరోవైపు వివో వై03 స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండోనేషియాలో లాంచ్ అయింది. గతంలో మనదేశంలో లాంచ్ అయిన వివో వై02కు తర్వాతి వెర్షన్‌గా వై03 మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో వివో చాలా అప్‌గ్రేడ్స్ చేసింది. రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు, కలర్ ఆప్షన్లలో వివో వై03ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలను కంపెనీ అందించింది. వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర అక్కగ 12.99 లక్షల ఇండోనేషియా రూపాయలుగా (మనదేశంలో రూ.6,900) నిర్ణయించారు. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను 14.99 లక్షల ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.8,000) ఉంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.

Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget