OnePlus TV 50 Y1s Pro: వన్‌ప్లస్ కొత్త టీవీ దిగింది - 50 ఇంచుల టీవీల్లో బెస్ట్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన వై1ఎస్ ప్రో టీవీని మనదేశంలో లాంచ్ చేసింది.
వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ తాజాగా లాంచ్ చేసిన 4కే టీవీ ఇదే. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రోకి అప్‌గ్రేడ్‌గా ఈ టీవీ లాంచ్ అయింది. ఇందులో 50 అంగుళాల 4కే స్క్రీన్‌ను అందించారు. 10 బిట్ కలర్ డెప్త్, హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లకు సపోర్ట్ కూడా ఉంది. గతేడాది షియోమీ లాంచ్ చేసిన రెడ్‌మీ ఎక్స్50తో ఇది పోటీ పడనుంది.
వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో ధర
ఈ టీవీ ధరను మనదేశంలో రూ.32,999గా నిర్ణయించారు. జులై 7వ తేదీన అమెజాన్, వన్‌ప్లస్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో ఈ టీవీ అందుబాటులోకి రానుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే రూ.3,000 తగ్గింపు లభించనుంది. దీంతోపాటు 12 నెలల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా వన్‌ప్లస్ అందించనుంది.
వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 10.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 50 అంగుళాల 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లే ఉండనుంది. హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది. 24W సౌండ్ అవుట్‌పుట్‌ను డెలివరీ చేసే ఫుల్ రేంజ్ స్పీకర్లు అందించారు. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది.
ఆక్సిజన్‌ప్లే 2.0ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 230 లైవ్ చానెళ్లను ఈ స్మార్ట్ టీవీ ద్వారా అందించనున్నారు. కంపాటిబుల్ స్మార్ట్ ఫోన్లను రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించడానికి వీలయ్యే వన్‌ప్లస్ కనెక్ట్ 2.0 ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. క్రోమ్‌కాస్ట్, మిరాకాస్ట్‌లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. వాయిస్ కమాండ్స్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది.
2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను ఈ టీవీలో అందించారు. వైఫై, బ్లూటూత్ వీ5.0, మూడు హెచ్‌డీఎంఐ 2.1, రెండు యూఎస్‌బీ 2.0, ఒక ఆర్‌జే45 ఎథర్‌నెట్ పోర్టు, ఆప్టికల్ ఆడియో అవుట్‌పుట్ కూడా ఇందులో ఉన్నాయి. ఏవీ ఇన్‌పుట్‌ను కూడా ఇది అందించనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!