By: ABP Desam | Updated at : 17 Jul 2022 04:53 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
కూకా గూగుల్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది.
చైనాకు చెందిన స్మార్ట్ టీవీ బ్రాండ్ కూకా మనదేశంలో కొత్త గూగుల్ టీవీలను లాంచ్ చేసింది. 43 అంగుళాల, 55 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. అమెజాన్‌లో వీటి ధర రూ.29,999 నుంచి ప్రారంభం కానుంది.
ఈ కూకా గూగుల్ టీవీల్లో 4కే హెచ్‌డీఆర్, డాల్బీ ఆడియో, స్వయోట్ హోం, గూగుల్ డ్యూయో సపోర్టెడ్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే మీ టీవీని కేవలం వాయిస్ కమాండ్స్‌తోనే ఉపయోగించే అవకాశం ఉందన్న మాట.
ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఐఆర్ పోర్టు ఉన్నాయి. వీటి ద్వారా సెట్ టాప్ బాక్సులు, గేమింగ్ కన్సోల్స్, బ్లూరే ప్లేయర్లు, హార్డ్ డిస్క్‌లు, డీవీడీ ప్లేయర్లను కనెక్ట్ చేసుకోవచ్చు.
ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ సహా చాలా ఓటీటీ యాప్స్‌ను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. లేటెస్ట్ ఎక్స్‌ట్రీమ్ 2.0 లార్జ్ ఇమేజ్ ఇంజిన్ ఫీచర్ ఉంది. ఇది ఇమేజ్ డిటైల్స్‌ను పర్‌ఫెక్ట్‌గా రీస్టోర్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Philips Smart TV: సూపర్ డిస్ప్లేలతో స్మార్ట్ టీవీలు లాంచ్ చేసిన ఫిలిప్స్ - ధర ఎంతంటే?
Forbes India: గోదావరిఖని యువకుడి సత్తా, ఫోర్బ్స్ ఇండియాలో చోటు - ఇతను అందరికీ తెలిసిన వ్యక్తే!
Infinix 32Y1 Sale: ఇన్ఫీనిక్స్ బడ్జెట్ స్మార్ట్ టీవీ సేల్ ప్రారంభం - రూ.8 వేలలోనే!
Infinix 32Y1: రూ.ఎనిమిది వేలలోనే స్మార్ట్ టీవీ - డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు కూడా!
Hisense 120L9G: ప్రపంచంలోని మొదటిసారి ఆ టెక్నాలజీతో టీవీ - భారీ సైజు కూడా!
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్