By: ABP Desam | Updated at : 01 Nov 2021 04:27 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ టాప్-5 ఫోన్లు ఇవే
మీరు ఈ దీపావళికి కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? లేదా మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఆ అవకాశం రెండు రోజులు మాత్రమే ఉంది. ఎందుకంటే అమెజాన్ దీపావళి సేల్ రెండ్రోజుల్లో ముగిసిపోనుంది. దీంతోపాటు మొబైల్స్‌పై ఉన్న డీల్స్ కూడా ఇక అందుబాటులో ఉండవు. కాబట్టి అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న బెస్ట్ సెల్లింగ్ ఫోన్లపై ఓ లుక్కేయండి..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. శాంసంగ్ గెలాక్సీ ఎం12
దీనిపై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా, ఈ సేల్‌లో రూ.9,499కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.1,250 వరకు తగ్గింపు లభించనుంది. మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ ద్వారా కొంటే అదనంగా రూ.8,950 తగ్గనుంది. ఈ ఆఫర్లతో పాటు దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. ఇందులో 6000 ఎంఏహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీ కూడా ఉంది. దీని స్క్రీన్ సైజు 6.5 అంగుళాలు కాగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం12 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. ఒప్పో ఏ31
ఈ సేల్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్లలో ఒప్పో ఏ31 కూడా ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ.15,990 కాగా.. ఈ సేల్‌లో రూ.11,490కే కొనుగోలు చేయవచ్చు. రూ.1,250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా దీనిపై లభించనుంది. దీంతోపాటు మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.10,800 తగ్గింపు లభించనుంది. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలు అందించారు.
ఒప్పో ఏ31 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
3. టెక్నో స్పార్క్ 7టీ
ఈ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా, ఈ సేల్‌లో రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై కూడా రూ.1,250 వరకు తగ్గింపు బ్యాంక్ ఆఫర్ ద్వారా లభించనుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ఆఫర్లు కూడా దీనిపై అందించారు. ఇందులో వెనకవైపు 48 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.
టెక్నో స్పార్క్ 7టీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
4. రెడ్‌మీ నోట్ 10 లైట్
అమెజాన్‌లో మంచి రెడ్‌మీ ఫోన్ కొనాలనుకుంటే రెడ్ మీ నోట్ 10 లైట్ ట్రై చేయవచ్చు. ఈ ఫోన్ రూ.14,999కే ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. రూ.14 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ దీనిపై అందించనున్నారు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందించారు. ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ కెమెరా కూడా ఉన్నాయి. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్‌గా ఉంది.
రెడ్‌మీ నోట్ 10 లైట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
5. ఐకూ జెడ్3 5జీ
అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్లలో ఐకూ జెడ్3 5జీ కూడా ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ.24,990 కాగా. ఈ సేల్‌లో రూ.18,990కే కొనేయచ్చు. దీనిపై రూ.14 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభించనుంది. ఇందులో 5జీ ఫీచర్ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్ కాగా, 55W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది.
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Samsung Galaxy S22: సూపర్ లుక్‌లో శాంసంగ్ ఎస్22 ఫోన్ - కొత్త కలర్లో లాంచ్ చేసిన కంపెనీ!
Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!
Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్
Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి