అన్వేషించండి

Budget Smartphone: రూ.10 వేలలోపే కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు, భారీ బ్యాటరీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మనదేశంలో ఇటీవలే స్పార్క్ 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులో కొత్తగా 3 జీబీ వేరియంట్ అందుబాటులోకి తీసుకువచ్చారు.

టెక్నో స్పార్క్ 8 కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు తాజాగా లాంచ్ అయిన వేరియంట్‌లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీని ధర రూ.9,299గా ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించి గతంలో మనదేశంలో 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే మనదేశంలో లాంచ్ అయింది.

గతంలో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 8కు, దీనికి మధ్య ర్యామ్, స్టోరేజ్ తప్ప మిగతా తేడాలు ఏవీ లేవు. అట్లాంటిక్ బ్లూ, టర్కోయిస్ సియాన్, ఐరిస్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

టెక్నో స్పార్క్ 8 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా అందించారు. దీని ద్వారా మీకు నచ్చిన వారికి మీ ఫీలింగ్స్‌ను మీ సొంత భాషలో తెలిపే అవకాశం ఉంటుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.  ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో స్పార్క్ 8 పనిచేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, క్యూవీజీఏ సెన్సార్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది. 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు.

Also Read: ఈ బడ్జెట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా.. బ్యాడ్ న్యూస్.. రేట్లు పెరిగాయి!

Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
Wired vs Wireless Internet: వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget