News
News
X

Tecno Pova Neo: రూ.14 వేలలోపే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే.. అదిరిపోయే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ టెక్నో పోవా నియోను లాంచ్ చేసింది.

FOLLOW US: 

టెక్నో పోవా నియో స్మార్ట్ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయింది. ఇందులో మూడు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

టెక్నో పోవా నియో ధర
టెక్నో అధికారిక వెబ్‌సైట్లో ఈ ఫోన్ ధరను తెలపలేదు. కానీ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో మాత్రం 75,100 నైజీరియన్ నైరాల(సుమారు రూ.13,800) ధరతో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. గీక్ బ్లూ, ఆబ్సీడియన్, పోవెహీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

టెక్నో పోవా నియో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 84.8 శాతంగా ఉంది. హోల్ పంచ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. వెనకవైపు క్వాడ్ ఫ్లాష్, ముందువైపు డ్యూయల్ ఫ్లాష్‌ను ఇందులో అందించారు.

బ్లూటూత్, వైఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, ఎఫ్ఎం రేడియో, ఓటీజీలు ఇందులో ఉన్నాయి. జీ-సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.

6000 ఎంఏహెచ్ బ్యాటరీని టెక్నో ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందించింది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్ చేయనుంది. 24 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం, 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైం, 40 గంటల వరకు కాలింగ్ టైంను ఇది అందించనుంది. 15 నిమిషాల చార్జింగ్‌తో మూడు గంటల వరకు గేమింగ్ చేయవచ్చని కంపెనీ అంటోంది. దీని మందం 0.91 సెంటీమీటర్లుగా ఉండనుంది.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Dec 2021 08:23 PM (IST) Tags: smartphone Tecno New Phone Tecno Tecno Pova Neo Price Tecno Pova Neo Tecno Pova Neo Specifications Tecno Pova Neo Features Tecno Pova Neo Launched

సంబంధిత కథనాలు

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

Tecno Pova Neo 2: 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఫోన్ - రూ.14 వేలలోపే!

Tecno Pova Neo 2: 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఫోన్ - రూ.14 వేలలోపే!

Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

టాప్ స్టోరీస్

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

మీ నిరసన పద్దతి నచ్చింది, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తాం- మంత్రి కేటీఆర్

మీ నిరసన పద్దతి నచ్చింది, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తాం- మంత్రి కేటీఆర్

Dadisetti Raja On NTR : ఎన్టీఆర్ చేతగాని వ్యక్తి, అందుకే రెండుసార్లు వెన్నుపోటు - మంత్రి దాడిశెట్టి రాజా

Dadisetti Raja On NTR : ఎన్టీఆర్ చేతగాని వ్యక్తి, అందుకే రెండుసార్లు వెన్నుపోటు - మంత్రి దాడిశెట్టి రాజా

Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి

Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి