Tecno Pop 8: రూ.ఆరు వేలలోపే 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ - చవకైన ఫోన్ కొనాలంటే బెస్ట్ ఆప్షన్!
Tecno Pop 8 Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 8.
Tecno Pop 8 Price in India: టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్‌గా 2023 అక్టోబర్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా, 10W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫోన్ ముందువైపు డ్యూయల్ ఫ్లాష్ యూనిట్ కూడా ఉంది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్లో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్ ఉంది. అయితే స్టోరేజ్ ద్వారా మరో 4 జీబీని ర్యామ్‌గా వాడుకోవచ్చు. అంటే మొత్తంగా 8 జీబీ ర్యామ్ అన్నమాట.
టెక్నో పాప్ 8 ధర, ఆఫర్లు
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. జనవరి 9వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ.5,999కే కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పాప్ 8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డాట్ ఇన్ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. డైనమిక్ పోర్టు ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. ఇది యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఉండనుంది. క్విక్ నోటిఫికేషన్లు కూడా ఈ ఫోన్ అందించనుంది. ఫ్రంట్ ప్యానెల్‌కు ప్యాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది.
యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై టెక్నో పాప్ 8 రన్ కానుంది. టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉండనుంది. ర్యామ్‌ను అదనంగా 4 జీబీ నుంచి 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆధారిత హైఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పాప్ 8 పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. దీంతోపాటు డ్యూయల్ ఎల్ఈడీ మైక్రో స్లిట్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. డీటీఎస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10W వైర్డ్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ లాక్ ద్వారా ఫోన్‌లో డేటాని సెక్యూర్ చేయవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!