IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Tecno POP 5 LTE: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 5 ఎల్టీఈ.

FOLLOW US: 

టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ 14 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని టెక్నో తెలిపింది. ఈ ఫోన్ ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌లో గతేడాది నవంబర్‌‌లోనే లాంచ్ అయింది. యువత లక్ష్యంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

టెక్నో పాప్ 5 ఎల్టీఈ ధర
దీని ధరను రూ.6,299గా నిర్ణయించారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జనవరి 16వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. డీప్ సీ క్లస్టర్, ఐస్ బ్లూ, టర్కోయిస్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్పెసిఫికేషన్లు
టెక్నో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తన వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయలేదు. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. వాల్ట్ 2.0, స్మార్ట్ ప్యానెల్ 2.0, సోషల్, టర్బో, డార్క్ థీమ్స్, పేరెంటల్ కంట్రోల్, డిజిటల్ వెల్‌బీయింగ్, జెస్చర్ కాల్ పికర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో కంపెనీ అందించింది. 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డాట్ నాచ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు.

ఈ ఫోన్ ప్రాసెసర్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. మిగతా మార్కెట్లలో ఈ ఫోన్ ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. అమెజాన్ టీజర్ పేజీ ప్రకారం.. ఇందులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ వెనకవైపు డ్యూయల్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. తెలుగు, హిందీ, బెంగాలీ, ఉర్దూ సహా మొత్తం 14 భారతీయ భాషలను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఐపీఎక్స్2 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, జీపీఆర్ఎస్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను అందించారు.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 12 Jan 2022 03:40 PM (IST) Tags: Tecno New Phone Tecno Tecno POP 5 LTE Launched Tecno POP 5 LTE Specifications Tecno POP 5 LTE Tecno POP 5 LTE Features Tecno POP 5 LTE Price in India Tecno New Budget Phone

సంబంధిత కథనాలు

240W Fast Charging: 10 నిమిషాల్లోనే 100 పర్సెంట్ చార్జింగ్ - రూపొందిస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్!

240W Fast Charging: 10 నిమిషాల్లోనే 100 పర్సెంట్ చార్జింగ్ - రూపొందిస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్!

OnePlus Nord 2T India Launch: జులై 1న వన్‌ప్లస్ కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

OnePlus Nord 2T India Launch: జులై 1న వన్‌ప్లస్ కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Moto G42 India Launch: జులై 4వ తేదీన మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ - ధర ఎంత ఉండచ్చంటే?

Moto G42 India Launch: జులై 4వ తేదీన మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ - ధర ఎంత ఉండచ్చంటే?

Noise Nerve Pro: రూ.900లోపు మంచి నెక్‌బ్యాండ్ కోసం చూస్తున్నారా - అయితే ఈ ఇయర్‌ఫోన్స్ మీకు మంచి ఆప్షన్!

Noise Nerve Pro: రూ.900లోపు మంచి నెక్‌బ్యాండ్ కోసం చూస్తున్నారా - అయితే ఈ ఇయర్‌ఫోన్స్ మీకు మంచి ఆప్షన్!

Netflix New Plans: తక్కువ ధరలో నెట్‌ఫ్లిక్స్ చూడాలనుకుంటున్నారా - అయితే మీకు గుడ్‌న్యూస్!

Netflix New Plans: తక్కువ ధరలో నెట్‌ఫ్లిక్స్ చూడాలనుకుంటున్నారా - అయితే మీకు గుడ్‌న్యూస్!

టాప్ స్టోరీస్

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ