Sony Neckband Speakers: ఈ స్పీకర్లను మెడలో వేసుకోవచ్చు.. అదిరిపోయే ఫీచర్లు!
ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ కొత్త నెక్ బ్యాండ్ స్పీకర్లను లాంచ్ చేసింది.
సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్‌బీ10, సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్ఎస్7 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ స్పీకర్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో ఎస్ఆర్ఎస్-ఎన్‌బీ10 స్పీకర్ ద్వారా కాల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్ఎస్7 స్పీకర్ ద్వారా కాల్స్ కూడా తీసుకోవచ్చు.
సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్‌బీ10, సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్ఎస్7 ధర
వీటిలో సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్‌బీ10 ధరను రూ.11,990గా నిర్ణయించారు. ఇక సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్ఎస్7 ధర రూ.22,990గా ఉంది. అమెజాన్, షాప్ఎట్ఎస్సీ, అమెజాన్, పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్లలో వీటిని జనవరి 24వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్‌బీ1 స్పెసిఫికేషన్లు
సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్‌బీ10 స్పీకర్‌లో ఫుల్ రేంజ్ స్పీకర్లను అందించారు. ఇందులో పాసివ్ రేడియేటర్లను అందించారు. ఇది బేస్‌ను బూస్ట్ చేయనుంది. సోనీ తెలిపిన దాని ప్రకారం ఈ స్పీకర్లను ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌ల కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ఇందులో మైక్రోఫోన్ మ్యూట్ బటన్, టచ్ సెన్సిటివ్ వాల్యూమ్ రాకర్, ప్లే, పాజ్ బటన్లు ఉండనున్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 20 గంటల ప్లేటైంను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించనున్నారు.
సోనీ ఎస్ఆర్ఎస్-ఎన్ఎస్7 స్పెసిఫికేషన్లు
ఇందులో సినిమాటిక్ సరౌండ్ ఫీచర్ అందుబాటులో ఉంది. 360 స్పేషియల్ సౌండ్ పర్సనలైజర్ యాప్ కూడా ఇందులో అందించారు. సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ మోడళ్లతో కంపాటిబుల్ అయ్యే ప్రపంచంలోని మొదటి వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ స్పీకర్లు ఇవేనని కంపెనీ తెలిపింది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 12 గంటల ప్లేటైంను ఈ నెక్‌బ్యాండ్ అందించనుందని కంపెనీ పేర్కొంది. పూర్తి వాల్యూమ్‌తో ఉపయోగిస్తే ఐదు గంటల ప్లేబ్యాక్ టైం అందుబాటులో ఉండనుంది. ఇందులో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉండనుంది. 10 నిమిషాలు చార్జ్ చేస్తే ఒక గంట ప్లేబ్యాక్ టైంను ఇది అందించనుంది.
Sony SRS-NB10, SRS-NS7 Wi-fi Neckband Audio system, WLA-NS7 Wi-fi Transmitter Launched in India - Newsworldpress @ https://t.co/XVouTjhW5U pic.twitter.com/7mA9kCBow1
— newsworldpress.com (@NewsWorldPress) January 24, 2022
Also Read: iPhone 15 Series: ఐఫోన్లలో మొదటిసారి ఆ కెమెరాలు.. ఎప్పుడు రానున్నాయంటే?
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి