Samsung Event 2021: శాంసంగ్ గెలాక్సీ మెగా ఈవెంట్ నేడే.. ఏమేం గాడ్జెట్స్ రిలీజ్ అవుతాయంటే..!
మరికొన్ని గంటల్లో శాంసంగ్ అప్‌ప్యాక్డ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి 7.30 నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. దీనిలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లను విడుదల చేయనుంది.
శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కి (Samsung Galaxy Unpacked Event) రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో శాంసంగ్ కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ రోజు (ఆగస్టు 11) రాత్రి 7.30 నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించవచ్చు. దీనిలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లను విడుదల చేయనుంది. ఇవి రెండు ఫోన్లు గతంలో శాంసంగ్ నుంచి రిలీజైన ఫోల్డబుల్ ఫోన్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటి ధర కూడా బడ్జెట్ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లను, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 మోడళ్లను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
Ready to go from good to great? Join us as we unfold this #SamsungUnpacked, August 11, 2021.
— Samsung Mobile (@SamsungMobile) July 21, 2021
Learn more: https://t.co/U3NHdnqd9G pic.twitter.com/lHI02uINFk
లైవ్ ఎలా చూడాలి?
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నిర్వహించనున్న ఈ లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్‌ను.. శాంసంగ్ డాట్ కామ్ (Samsung.com), ఫేస్ బుక్ ద్వారా వీక్షించవచ్చు. శాంసంగ్ ఈ ఏడాది జనవరిలో ఒక అప్‌ప్యాకెడ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో గెలాక్సీ ఎస్ 21 సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పాటుగా గెలాక్సీ బడ్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లను ఆవిష్కరించింది.
Watch Galaxy Unpacked LIVE tonight at 7:30PM. Register now: https://t.co/S5VkNXenBn and tag your friends with whom you want to watch the livestream. It’s an experience you don’t want to miss! #SamsungUnpacked
— Samsung India (@SamsungIndia) August 11, 2021
ఏమేం గాడ్జెట్లు రానున్నాయి?
ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం ఈ కార్యక్రమంలో రెండు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, రెండు కొత్త స్మార్ట్ వాచ్ లు విడుదలయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 పేరుతో ఫోల్డబుల్ ఫోన్లు రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 పేరుతో ఇయర్‌బడ్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ పేర్లతో రెండు స్మార్ట్ వాచ్‌లు రానున్నాయి.
'
జెడ్ ఫోల్డ్ 3, ఫ్లిప్ 3 ధర?
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ధర రూ.1,49,990గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక జెడ్ ఫ్లిప్ 3 విషయానికి వస్తే.. దీని ధర రూ.80000 నుంచి రూ.90000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండూ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3లో 7.6-అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ బయటవైపు 6.2 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ రెండు స్కీన్ల రిఫ్రెష్ రేట్ 120 Hzగానే ఉండనుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4400 ఎంఏహెచ్ గా ఉండే అవకాశం ఉంది.