(Source: ECI/ABP News/ABP Majha)
Samsung Galaxy S24 Ultra: ఎస్23 కంటే భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ కానున్న ఎస్24 అల్ట్రా - ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే బెటర్‌గా!
Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి.
Samsung Galaxy S24 Series: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను జనవరిలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. అవే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24), శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ (Samsung Galaxy S24 Plus), శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra). వీటిలో అత్యంత ప్రత్యేకమైనది శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా. ఇంతకు ముందు వెర్షన్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా తరహాలోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో కూడా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈసారి శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు ఏఐ సపోర్ట్ కూడా లభించనుందట. ఎందుకంటే క్వాల్‌కాం ఏఐ సపోర్ట్‌తో లాంచ్ చేసిన తాజా ప్రాసెసర్ ఈ ఫోన్‌లో అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాకు సంబంధించి మూడు పెద్ద లీక్‌లు కూడా బయటకు వచ్చాయి.
మూడు పెద్ద అప్‌గ్రేడ్‌లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో గొప్ప కెమెరాను కలిగి ఉన్నప్పటికీ, ఫోటోలు కొన్నిసార్లు చాలా శాచురేట్ అవుతాయి. దీని కారణంగా ఫోటోలలోని రంగులు ఒరిజినల్‌గా కనిపించవు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో ఈ సమస్య తొలగించారని తెలుస్తోంది. దీనిలో మీరు మెరుగైన శాచురేషన్, షార్ప్‌నెస్ పొందుతారని సమాచారం.
ఏఐ ఫీచర్ కూడా...
శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో మీరు ఏఐ సపోర్ట్‌ను కూడా పొందుతారు. ఈ-మెయిల్స్ రాయడం, ఫోటోలను క్రియేట్ చేయడం, టెక్స్ట్‌ను అనువదించడం, వాయిస్‌ని అర్థం చేసుకోవడం మొదలైన వాటిలో ఏఐ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఫీచర్లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇది నిజమైతే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా... ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max), గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) కంటే మెరుగ్గా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్‌తో, ఎస్24 ప్లస్‌ను 12జీబీ ర్యామ్‌తో లాంచ్ చేయవచ్చని నివేదికలో పేర్కొన్నారు. 8 జీబీ ర్యామ్ ఒక రకంగా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని వలన ఈ ఫోన్ పని చేయడానికి ఎక్కువ ర్యామ్ అవసరం.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఇవన్నీ లీకులే. కాబట్టి లాంచ్ అయ్యేలోపు స్పెసిఫికేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కచ్చితమైన సమాచారం కావాలంటే కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. ధర గురించి చెప్పాలంటే... కంపెనీ ఎస్23 సిరీస్‌ను ఏ ధరలో లాంచ్ చేసిందో అదే ధరలో ఎస్24 సిరీస్‌ను లాంచ్ చేయగలదని తెలుస్తోంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!