Galaxy M32 5G: శాంసంగ్ గెలాక్సీ ఎం32జీ 5జీ సేల్ స్టార్ట్ అయింది.. ప్రారంభ ఆఫర్ల కింద తక్కువ రేటుకే..
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ నేటి నుంచి ప్రారంభం అయింది. అమెజాన్, శాంసంగ్ డాట్ కామ్, పలు రిటైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద దీనిపై మంచి డీల్స్ ఉన్నాయి.
దక్షిణ కొరియా టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ నుంచి ఇటీవల విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ నేటి (సెప్టెంబర్ 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను గత నెల 25న ఇండియాలో లాంచ్ చేసింది. మిడ్ టైర్ ఫోన్‌గా ఇది దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720సీ ప్రాసెసర్‌పై పనిచేయనుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ముందు వైపు సెల్ఫీల కోసం నాచ్ షూటర్ ఉంటుంది. అమెజాన్, శాంసంగ్ డాట్ కామ్, రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ ధర..
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీలో.. రెండు వేరియంట్లు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా ఉంది. స్లేట్ బ్లాక్, స్లేట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ మీద రూ.2000 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 9 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. శాంసంగ్ కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్పెసిఫికేషన్లు..
డ్యూయల్ సిమ్ (నానో) శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే అందించారు. రీఫ్రెష్ రేటు 60 Hzగా ఉంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720సీ ప్రాసెసర్‌పై పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
కెమెరాల విషయానిక వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ ఫోనులో వెనుకవైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందించారు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. ఇక ముందువైపు నాచ్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
Also Read: Twitter Super Follows: ట్విట్టర్‌లో సూపర్ ఫాలోస్.. ఇందులోనూ సంపాదించేయొచ్చు!
Also Read: SmartPhones in September: సెప్టెంబరులో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..