Galaxy M32 5G: 25న శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ లాంచ్.. సేమ్ దానిలానే ఉంది..
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్ ఫోన్.. ఆగస్టు 25న ఇండియాలో లాంచ్ కానుంది. అమెజాన్, శాంసంగ్ డాట్ కామ్, కొన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానుంది.
దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి మరో గెలాక్సీ ఫోన్ రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్ ఫోన్.. వచ్చే వారం ఇండియాలో లాంచ్ కానుంది. గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ను ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని అమెజాన్ ఇండియా పేజీ టీజర్ రూపంలో విడుదల చేసింది. అమెజాన్, శాంసంగ్ డాట్ కామ్, కొన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
కాగా, శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం32 4జీ స్మార్ట్ ఫోన్ జూలైలో విడుదలైన విషయం తెలిసిందే. దీని బ్యాటరీ కెపాసిటీ 6000 ఎంఏహెచ్‌గా ఉంది. తాజాగా రిలీజ్ కానున్న గెలాక్సీ ఎం32 5జీ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందించారు. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు సెల్ఫీల కోసం నాచ్ కెమెరా ఉండనుంది.
గెలాక్సీ ఎం32 5జీ స్పెసిఫికేషన్లు..
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720సీ ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే అందించారు. వెనుకవైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందించారు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు ముందు వైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానుంది.
శాంసంగ్ నాక్స్ (Knox) సెక్యూరిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ పన్నెండు 5జీ బ్యాండ్‌లను సపోర్టు చేయనుంది. రెండేళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు ఉండవని టీజర్ పోస్టులో తెలిపింది. ఇది డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. స్లీక్, ప్రీమియం డిజైన్‌తో స్టైలిష్ లుక్‌తో రానుంది.
Also Read: Motorola Edge 20: వన్‌ప్లస్ నార్డ్ 2కు గట్టి పోటీ ఇచ్చే మోటొరోలా ఎడ్జ్ 20 వచ్చేసింది.. ఆగస్టు 24 నుంచి సేల్ స్టార్ట్..
సేమ్ దానిలానే ఉంది..
ఈ ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్లో విడుదలైన శాంసంగ్ ఏ32 5జీకి రీబ్రాండ్ వెర్షన్‌గా ఇది ఎంట్రీ ఇవ్వనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లు చూడటానికి కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. అలాగే అమెజాన్ విడుదల చేసిన స్పెసిఫికేషన్లు కూడా దాదాపు సేమ్ ఉన్నాయి. ఇందులో 6 జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 ధర ఇలా..
శాంసంగ్ నుంచి ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎం32 4జీలో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. బ్లాక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 25W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
Also Read: Realme GT Master Edition: గేమర్ల కోసం జీటీ మాస్టర్ ఎడిషన్... అరె ఈ ఫీచర్ భలే ఉందిగా!