News
News
X

Samsung F42 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.18 వేలలోపే సూపర్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మనదేశంలో తన కొత్త ఫోన్ గెలాక్సీ ఎఫ్42 5జీని మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.20,999 నుంచి ప్రారంభం కానుంది. దీనిపై ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. గెలాక్సీ ఎఫ్-సిరీస్‌లో 5జీ కనెక్టివిటీని అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది, ఐకూ జెడ్3, మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్, రియల్‌మీ ఎక్స్7 5జీలతో పోటీ పడనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ ధర
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. మ్యాట్ ఆక్వా, మ్యాట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనిపై పలు ఆఫర్లు కూడా అందించారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో దీన్ని కొనుగోలు చేస్తే.. రూ.3,000 తగ్గింపు కూడా లభించనుంది. ఈ ఆఫర్‌తో 6 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.17,999కు, 8 జీబీ ర్యామ్ 19,999కు కొనుగోలు చేయవచ్చు.

Also Read: రూ.7,500లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. రెండు ఫోన్లు లాంచ్.. 43 రోజుల బ్యాటరీ లైఫ్!

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. హైపర్‌ల్యాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, నైట్ మోడ్, పనోరమ, ప్రో మోడ్‌లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉండనున్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.9 సెంటీమీటర్లుగా ఉంది.

Also Read: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Sep 2021 06:10 PM (IST) Tags: samsung Samsung New Phone Samsung Galaxy F42 5G Samsung Galaxy F42 5G Price in India Samsung Galaxy F42 5G Specifications Samsung Galaxy F42 5G Features

సంబంధిత కథనాలు

Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్‌, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్

WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్‌, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్

Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?

Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?

WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!

WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!

Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!

Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!

టాప్ స్టోరీస్

పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?

పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?

Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !

Nellore Anam  :  నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !

Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!

Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!

Stock Market News: బడ్జెట్‌ ముందు పాజిటివ్‌గా స్టాక్‌ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!

Stock Market News: బడ్జెట్‌ ముందు పాజిటివ్‌గా స్టాక్‌ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!