Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ73ని త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ73 స్మార్ట్ ఫోన్ రెండర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీనికి సంబంధించిన డిజైన్ ఇందులో చూడవచ్చు. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ72కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసిన రెండర్ల ప్రకారం.. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లే ఉండనుంది. డిజైన్ విషయంలో భారీ మార్పులు కనిపించలేదు. దీని ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది.
లీకైన రెండర్ల ప్రకారం.. గెలాక్సీ ఏ73 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈ నెలలో లాంచ్ కానుంది. దీని ధర రూ.32,999గా ఉండనుంది. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ కటౌట్‌ను సరిగ్గా పైన మధ్యభాగంలో అందించనున్నారు. ఫోన్ కిందవైపు అంచు కూడా సన్నగా ఉండనుంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ అంచులు గుండ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా కనిపించలేదు. కాబట్టి యూఎస్‌బీ టైప్-సీ పోర్టునే ఇయర్ ఫోన్స్‌కు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ73 స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇప్పటి వరకు వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ లేదా 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ మందం కేవలం 0.76 సెంటీమీటర్లు మాత్రమే ఉండనుందని సమాచారం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ కనెక్టివిటీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ73లో వైట్ కలర్ ఆప్షన్ కూడా ఉండనుందని గతంలో వార్తలు వచ్చాయి. మరి ఆ కలర్ వేరియంట్ నిజంగా ఉందో లేదో తెలియాల్సి ఉంది.
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!