Samsung Galaxy A53 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్లు వచ్చేశాయ్ - వెనకవైపు నాలుగేసి కెమెరాలు - ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అవే శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ.
శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ, గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్ ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది. గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీ, గెలాక్సీ ఏ32 5జీలకు తర్వాతి వెర్షన్‌గా ఇవి లాంచ్ అయ్యాయి. ఈ రెండిట్లోనూ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను వీటిలో అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధర 449 యూరోల (సుమారు రూ.37,800) నుంచి ప్రారంభం కానుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ ధర
శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్ ఫోన్ ధర 369 యూరోల (సుమారు రూ.31,000) నుంచి ప్రారంభం కానుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలోనే ఈ ఫోన్ కూడా కొనుగోలు చేయవచ్చు. అసమ్ బ్లాక్, అసమ్ బ్లూ, అసమ్ పీచ్, అసమ్ వైట్ రంగుల్లోనే వీటిని కూడా కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ
ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్ కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్ పైనే పనిచేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇక మిగతా ఫీచర్లన్నీ శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ తరహాలోనే ఉన్నాయి.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?