Galaxy A52s 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ లాంచ్ రేపే.. ధర ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను బుధవారం (సెప్టెంబర్ 1) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ రేపు (సెప్టెంబర్ 1) భారతదేశంలో విడుదల కానుంది. గత వారంలో యూకేలో లాంచ్ అయిన ఈ ఫోన్.. ఇప్పుడు ఇండియాలో ఎంట్రీ ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ అందించారు. ఇందులో వెనుకవైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఇది రానుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందించారు. దీంతో పాటుగా 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఆసమ్ బ్లాక్, ఆసమ్ వైలెట్, ఆసమ్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించనుంది.
Experience the all new Awesome LIVE. Meet the super-fast, super-smooth and future ready #GalaxyA52s5G on September 1 at 12PM.
— Samsung India (@SamsungIndia) August 31, 2021
Get notified: https://t.co/hNRlTYSe59#BeFutureReady #AwesomeIsForEveryone #Samsung pic.twitter.com/go00OowS6I
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ధర..
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్ ధరకు సంబంధించి అమెజాన్ ఇండియా టీజర్ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. టీజర్ రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే కంపెనీ దీనిని తొలగించింది. అయితే అప్పటికే ఈ ఫోన్ ధరలను పలువురు స్క్రీన్ షాట్ తీశారు. వీటి ప్రకారం ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ప్రారంభ వేరియంట్ అయిన 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. హైఎండ్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999గా ఉండనుంది.
Awesome is just around the corner. Get ready as we unveil the all new #GalaxyA52s5G in its Awesome glory on 1st September, 12PM. Catch the super-fast, super smooth smartphone in 3 stunning shades, ready to win you over: Awesome black, Awesome white and Awesome violet. pic.twitter.com/DLrlC7T4IQ
— Samsung India (@SamsungIndia) August 28, 2021
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు.. (అంచనా)
యూకేలో విడుదలైన ఏ52ఎస్ 5జీ మోడల్ స్పెసిఫికేషన్లే రేపు లాంచ్ కానున్న ఫోన్‌లోనూ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం చూసుకుంటే.. ఏ52ఎస్ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ3తో పనిచేయనుంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ ఓ డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్ పనిచేస్తుంది.
Also Read: SmartPhones in September: సెప్టెంబరులో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..