Samsung 5G Phone Offer: ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు - ప్రస్తుతం రూ.10 వేలలోపే!
Samsung Galaxy A14 5G Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాలీ సేల్‌లో భారీ తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్‌తో దీన్ని రూ.10 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
Samusng Best Selling 5G Phone: ప్రస్తుతం మనదేశంలో భారతదేశంలో పండుగ సీజన్ జరుగుతోంది. మీరు ఈ సీజన్‌ని సద్వినియోగం చేసుకుంటే స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలో దక్కించుకోవచ్చు. శాంసంగ్ బ్రాండ్ నుంచి రూ. 10,000 కంటే తక్కువ ధరతో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఒక ఫోన్ అందుబాటులో ఉంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ.
తక్కువ ధరలో శాంసంగ్ 5జీ ఫోన్...
ఈ శాంసంగ్ ఫోన్ పేరు శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14 5G). కొన్ని నెలల క్రితం కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 14,999గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతున్న సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 5,000 తగ్గింపు అందించారు. ఈ ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ధర రూ.9,999కు తగ్గుతుంది. అంటే రూ.10 వేలలోపు ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చన్న మాట. బ్యాంక్ ఆఫర్లను కూడా చూసుకుంటే దీని ధర ఇంకా తగ్గనుందని అనుకోవచ్చు
ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే ఇది లాంచ్ అయినప్పటి నుండి ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. 2023 కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం అప్పటి వరకు రెండు కోట్ల మంది ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు. బడ్జెట్ రేంజ్‌లో ఇది గొప్ప స్మార్ట్‌ఫోన్ అని అనుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్ దీపావళి సేల్‌లో వినియోగదారులు ఎస్‌బీఐ కార్డుతో పేమెంట్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును పొందవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో వినియోగదారులు 5జీ కనెక్టివిటీని మాత్రమే కాకుండా శాంసంగ్ ప్రీమియం బ్యాక్ డిజైన్‌ను కూడా పొందుతారు. ఇది వినియోగదారులకు ఖరీదైన ఫోన్ అనుభూతిని ఇస్తుంది. ఇది కాకుండా ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సహా అనేక ప్రత్యేక ఫీచర్లు అందించారు.
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
Jump, jive and keep your sporty vibe alive with the segment’s only _____featured on the #GalaxyM35 5G
— Samsung India (@SamsungIndia) October 18, 2024
A.Corning® Gorilla® Glass Victus®+ 😎
B. 120Hz sAmoled Display ☀️
C. Samsung Wallet 🤑
Comment with the right answer and the adjacent emoji.#MustBeAMonster #Samsung pic.twitter.com/Dly4IUzISt