By: ABP Desam | Updated at : 17 Feb 2022 03:46 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. (Image Credit: Xiaomi)
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో 43 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీంతోపాటు డాల్బీ విజన్, 30W స్పీకర్లు కూడా ఉన్నాయి.. అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో ఎక్స్50, ఎక్స్55, ఎక్స్65 మోడల్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 ధర
ఈ టీవీ ధరను రూ.28,999గా నిర్ణయించారు. అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్ సైట్, ఇతర రిటైల్ వెబ్ సైట్లలో ఈ టీవీ అందుబాటులో ఉంది. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 స్పెసిఫికేషన్లు
ఇందులో 43 అంగుళాల 4కే డిస్‌ప్లేను అందించారు. రెడ్‌మీ గతంలో లాంచ్ చేసిన స్మార్ట్ టీవీ 43లో 4కే ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కానీ ఇందులో మాత్రం హెచ్‌డీఆర్ సపోర్ట్ చేసే 4కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఇందులో సన్నని అంచులను అందించారు. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది.
ఇందులో 30W స్పీకర్లను అందించారు. డీటీఎస్ వర్చువల్:ఎక్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. హెచ్‌డీఎంఐ ఈఆర్క్ ద్వారా అట్మాస్ సౌండ్ బార్లు, రిసీవర్లకు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. మూడు హెచ్‌డీఎంఐ 2.1 స్లాట్లు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, ఆప్టికల్, 3.5 ఎంఎం జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీలో ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా కూడా ఉంది. ఈ ఫీచర్ ల్యాగ్‌ను 5 ఎంఎస్‌కు తగ్గిస్తుంది. 4కే 60 ఎఫ్‌పీఎస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. గేమింగ్స్ కన్సోల్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ప్యాచ్ వాల్ 4 యూఐ కూడా ఉంది. ఇందులో ఐఎండీబీ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. టీవీ సిరీస్, సినిమాల రేటింగ్స్‌ను ఇందులో చూడవచ్చు.
View this post on InstagramA post shared by MI STORE BY DINESH ELECRICALS (@dinesh.electricals_mi.store)
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
Vivo X80 Pro: సూపర్ కెమెరాలతో వచ్చిన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్లు - ఫీచర్లు మామూలుగా లేవుగా!
Realme Narzo 50 5G: రూ.14 వేలలోపే రియల్మీ 5జీ ఫోన్ - ఫీచర్లు అదుర్స్ - ఫోన్ ఎలా ఉందంటే?
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు