అన్వేషించండి

Redmi Note 14 5G: రూ.15 వేలలో బడ్జెట్ 5జీ ఫోన్ - రెడ్‌మీ నోట్ 14 5జీ వచ్చేసింది!

Redmi New Phone: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన లేటెస్ట్ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ నోట్ 14 5జీ. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది.

Redmi Note 14 5G Launched: రెడ్‌మీ నోట్ 14 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌లో ఈ ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 14 ప్రో, రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌పై ఇది రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5110 ఎంఏహెచ్ కాగా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.

రెడ్‌మీ నోట్ 14 5జీ ధర (Redmi Note 14 5G Price)
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,199 చైనీస్ యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.14,300) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,399 చైనీస్ యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,700), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,499 చైనీస్ యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.17,900), టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,499 చైనీస్ యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.20,300) ఉంది.

మొదటి సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై 100 యువాన్ల (సుమారు రూ.1,200) తగ్గింపు లభించనుంది. షావోమీ చైనా ఈ-స్టోర్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్ బ్లాక్, ఫాంటం బ్లూ, స్టార్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

రెడ్‌మీ నోట్ 14 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Redmi Note 14 5G Specifications)
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ,పీక్ బ్రైట్‌నెస్ 2100 నిట్స్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ అందించనున్నారు. ఆక్టాకోర్ 6 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 14 5జీ పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ సపోర్ట్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5110 ఎంఏహెచ్ కాగా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. డ్యూయల్ 5జీ ఎల్టీఈ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటెడ్ బిల్డ్ ఉంది. 

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget