Redmi Note 13R Pro: 108 మెగాపిక్సెల్ సెన్సార్‌తో రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో - ధర, ఫీచర్లు రివీల్ - బడ్జెట్ రేంజ్‌లోనే!
Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది.
Redmi New Phone Launch: రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ చైనా టెలికాం వెబ్ సైట్లో కనిపించింది. దీని ఫొటోలు, ధర వివరాలు, కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. దీని ప్రకారం ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే అందించనున్నారు. ఫోన్ మధ్యలో హోల్ పంచ్ కటౌట్ కూడా అందించారు. వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో ధర (అంచనా)
చైనా టెలికాం లిస్టింగ్ ప్రకారం... రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో స్మార్ట్ ఫోన్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,000) ఉంది. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 2311FRAFDC మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ లిస్ట్ అయింది. మిడ్‌నైట్ బ్లాక్, టైమ్ బ్లూ, మార్నింగ్ లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
ఈ లిస్టింగ్ ప్రకారం త్వరలో రానున్న ఈ రెడ్‌మీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. 6.67 అంగుళాల డిస్‌ప్లే ఇందులో ఉండనుంది. హోల్ పంచ్ కటౌట్ డిజైన్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో రన్ కానుంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్లు కూడా ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో అందించనున్నారు.
మరోవైపు ఇటీవలే రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయింది. ఇందులో 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సహాయంతో మంచి ఫొటోలు తీసుకోవచ్చు. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను రెడ్‌మీ 13సీ సపోర్ట్ చేయనుంది. హోల్ పంచ్ డిజైన్ కూడా ఇందులో ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 98,100 నైరాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.10,100) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 108,100 నైరాలుగా (సుమారు రూ.11,000), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 121,100 నైరాలుగా (సుమారు రూ.12,500) ఉంది. బ్లాక్, క్లోవర్ గ్రీన్ షేడ్స్‌లో రెడ్‌మీ 13 సీని కొనుగోలు చేయవచ్చు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!