By: ABP Desam | Updated at : 24 Jan 2022 06:20 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది.
రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం టీజ్ చేసింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నాయి.
ఇందులో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11ఎస్‌తో పాటు నోట్ 11 సిరీస్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 11 మోడల్స్ చైనాలో గతేడాది అక్టోబర్‌లోనే లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేసింది.
ఈ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. ఇందులో కేవలం 4జీ కనెక్టివిటీనే అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 5జీ కనెక్టివిటీ ఉండనుందో లేదో తెలియరాలేదు. సాధారణంగా రెడ్‌మీ నోట్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు రూ.20 వేలలోపు ధరతోనే లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ ధర కూడా అదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
ఈ నెల ప్రారంభం నుంచి రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ టీజ్ చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ రెండర్ల ప్రకారం.. ఈ ఫోన్‌లో హోల్ పంచ్ కెమెరా ఉండనుంది. సరిగ్గా డిస్‌ప్లే మధ్యలో ఈ కెమెరాను అందించనున్నారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉండనుంది.
వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ2ఏ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో అందించనున్నారు.
రెడ్‌మీ నోట్ 11ఎస్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. బీఐఎస్, ఎన్‌బీటీసీ లిస్టింగ్‌ల్లో కూడా రెడ్‌మీ నోట్ 11ఎస్ కనిపించింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను కంపెనీ జనవరి 26వ తేదీన నిర్వహించనుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 4జీ, రెడ్‌మీ నోట్ 11 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం ఉంది.
. 𝙎𝙚𝙩
— Redmi India - Redmi Note 11S (@RedmiIndia) January 24, 2022
It's time to -R̵a̵i̵s̵e̵ ^ 𝙩𝙝𝙚 𝘽𝙖𝙧!
We're bringing the all-new #𝗥𝗲𝗱𝗺𝗶𝗡𝗼𝘁𝗲𝟭𝟭𝗦 on 09.02.2022.
Join us as we gear up to #SetTheBar.
♥️ and 🔁 this tweet and help us share the word.
Get 𝗡𝗼𝘁𝗲-fied: https://t.co/c7MZGkvOJf pic.twitter.com/AiO4nKFOQY
Also Read: iPhone 15 Series: ఐఫోన్లలో మొదటిసారి ఆ కెమెరాలు.. ఎప్పుడు రానున్నాయంటే?
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Gmail Offline Inbox: జీమెయిల్ యూజర్స్‌కు గుడ్ న్యూస్- ఇంటర్నెట్ లేకుండానే మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు
240W Fast Charging: 10 నిమిషాల్లోనే 100 పర్సెంట్ చార్జింగ్ - రూపొందిస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్!
OnePlus Nord 2T India Launch: జులై 1న వన్‌ప్లస్ కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Moto G42 India Launch: జులై 4వ తేదీన మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ - ధర ఎంత ఉండచ్చంటే?
Noise Nerve Pro: రూ.900లోపు మంచి నెక్‌బ్యాండ్ కోసం చూస్తున్నారా - అయితే ఈ ఇయర్‌ఫోన్స్ మీకు మంచి ఆప్షన్!
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం
Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్