Redmi 10 Prime: రెడ్‌మీ నుంచి రూ.10 వేల రేంజ్ ఫోన్.. త్వరలోనే ఇండియాకు..
షియోమీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీని పేరు రెడ్‌మీ 10 ప్రైమ్. ఇటీవల మలేసియాలో విడుదలైన రెడ్‌మీ 10కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు మారుపేరైన షియోమీ ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.10 వేల లోపే ఉండే ఛాన్స్ ఉంది. షియోమీ ఇటీవల రెడ్‌మీ 10 పేరుతో స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం మలేసియాలో మాత్రమే విడుదలైంది. ఇప్పుడు ఈ ఫోన్ల పేరు రెడ్‌మీ 10 ప్రైమ్‌గా మార్చి.. ఇండియాలో లాంచ్ చేయాలని షియోమీ భావిస్తోందని లీకుల ద్వారా తెలుస్తోంది.
M21061119B మోడల్ నంబర్‌తో ఇటీవల ఒక షియోమీ ఫోన్ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. రెడ్‌మీ 10 మోడల్ నంబర్ బ్లూటూత్ ఎస్ఐజీ సైట్ (Bluetooth SIG) లో 21061119AGగా ఉంది. ఈ ఫోన్ మార్కెటింగ్ పేరు రెడ్‌మీ 10 ప్రైమ్‌గా ఉండటంతో ఈ లీకులకు మరింత ఊతమిచ్చినట్లయింది.
ఇదే విషయాన్ని గతంలో పలువురు టిప్‌స్టర్లు సైతం ప్రస్తావించారు. రెడ్‌మీ 10 ఫోన్ ఇండియాలో రెడ్‌మీ 10 ప్రైమ్‌గా రానుందని అంచనా వేశారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలపై పలువురు ట్వీట్లు కూడా చేశారు. అయితే దీనిపై షియోమీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
రెడ్‌మీ 10 ప్రైమ్ స్పెసిఫికేషన్లు (అంచనా)..
రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లపై ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం.. వీటిలో 6.5 అంగుళాల అడాప్టివ్ సింక్ డిస్‌ప్లే ఉండనుంది. రిఫ్రెష్ రేట్ 90 HZగా ఉండే అవకాశం ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.
ఇందులో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు అందించనుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమరాతో పాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ లను అందించనుంది. ఈ ఫోన్ ఎంఐయూఐ 12.5+ ఆధారంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇది బ్లూటూత్ వీ5.2ను సపోర్టు చేయనుంది.
దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించినట్లు తెలుస్తోంది. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. అయితే బాక్స్‌తో పాటు 22.5 వాట్స్ చార్జర్‌ను అందించనున్నారు. దీని బరువు 181 గ్రాములుగా ఉండనుంది.
Also Read: Raksha Bandhan 2021: వాట్సాప్‌లో రాఖీ స్టిక్కర్లు.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?