Realme C65 5G Price Revealed: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - షేక్ చేసే మొబైల్‌తో రానున్న రియల్‌మీ!
Realme C65 5G Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన బడ్జెట్ 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ సీ65 5జీ. దీని ధర రూ.10 వేలలోపే ఉండనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Realme C65 5G Price in India: రియల్‌మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. అయితే కచ్చితంగా ఏ తేదీన లాంచ్ కానుంది అన్నది మాత్రం తెలియరాలేదు. అయితే కంపెనీ ఈ ఫోన్ ధర ఎంత ఉండవచ్చో తెలిపింది. డిజైన్, స్పెసిఫికేషన్లను మాత్రం కంపెనీ ఇంకా టీజ్ చేయలేదు. అయితే తాజాగా దీనికి సంబంధించిన కొన్ని కీలక వివరాలు కూడా లీకయ్యాయి. రియల్‌మీ సీ65 4జీ ఆసియా మార్కెట్లలో ఇటీవలే లాంచ్ అయింది.
రియల్‌మీ సీ65 5జీ టీజర్‌ను కంపెనీ రివీల్ చేసింది. అంటే ఈ ఫోన్ దాదాపు లాంచ్‌కు రెడీ అయిపోయినట్లే. దీని ధర రూ.10 వేలలోపే ఉండనుంది. రియల్‌మీ టీజ్ చేసిన ఫొటో ప్రకారం చూస్తే ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో వేగవంతమైన 5జీ ఫోన్ ఇదే కానుంది. రియల్‌మీ సీ65 5జీ ప్రొడక్ట్ పేజ్ కూడా ఇప్పటికే లైవ్ అయింది. రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో ఇంత కంటే ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు.
రియల్‌మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్ 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.10 వేలలోపు, 6 జీబీ ర్యామ్ ధర వేరియంట్ ధర రూ.12 వేలలోపు, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15 వేలలోపు ఉండే అవకాశం ఉంది. బేస్ మోడల్ ధర మాత్రం కచ్చితంగా రూ.10 వేల లోపే ఉండనుంది.
Experience the future at your fingertips with the lightning-fast 5G of #realmeC65 5G pic.twitter.com/L2zVK2PxSj
— realme (@realmeIndia) April 18, 2024
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
రియల్‌మీ సీ65 5జీ ‘RMX3782’ అనే మోడల్ నంబర్‌తో రానున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ ఫోన్ స్టోరేజ్ 128 జీబీగా ఉండనుంది. గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ సీ65 4జీ వెర్షన్ తరహాలోనే 5జీ వేరియంట్ స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ సీ65 5జీ వేరియంట్ ఫీచర్లు రియల్‌మీ సీ65 4జీ వేరియంట్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా యూనిట్ ఉండనుంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. 5జీ వేరియంట్‌లో ఇంకో ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. రియల్‌మీ ఇప్పటికే మనదేశంలో చవకైన 5జీ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 60ఎక్స్ ప్రైమ్ రూ.11 వేల ధరతో అందుబాటులో ఉంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు