News
News
X

PUBG: New State: కొత్త పబ్జీ వచ్చేది ఆరోజే... ఒరిజినల్‌ను మించే స్థాయిలో గ్రాఫిక్స్, గేమ్ ప్లే!

పబ్జీ కొత్త వెర్షన్ అయిన న్యూ స్టేట్ గేమ్ లాంచ్ తేదీ వచ్చేస్తుంది. నవంబర్ 11వ తేదీన ఈ గేమ్‌ను విడుదల చేయనున్నట్లు గేమ్ పబ్లిషర్ క్రాఫ్టన్ అధికారికంగా ప్రకటించింది.

FOLLOW US: 
Share:

పబ్జీ: న్యూ స్టేట్ గేమ్ నవంబర్ 11వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని గేమ్ పబ్లిషర్ క్రాఫ్టన్ అధికారికంగా ప్రకటించింది. భారత్ సహా 200కు పైగా దేశాల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు ఒకేసారి ఈ గేమ్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ఫైనల్ టెక్నికల్ టెస్ట్ అక్టోబర్ 29, 30వ తేదీల్లో 28 దేశాల్లో జరగనుంది. ఈ గేమ్‌ను ఫిబ్రవరిలోనే అధికారికంగా ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌కు కలిపి 5 కోట్ల ప్రీ-రిజిస్ట్రేషన్లు దాటాయని కంపెనీ తెలిపింది. మనదేశంలో ఈ గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌లో ప్రారంభం అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 భాషల్లో ఈ గేమ్ లాంచ్ కానుంది. ఇది ఒక ఫ్రీ టు ప్లే మొబైల్ గేమ్. అంటే ఈ గేమ్ ఆడటానికి ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్న మాట. బహ్రెయిన్, కాంబోడియా, ఈజిప్టు, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, ఇరాక్, జపాన్, జోర్డాన్, కొరియా, కువైట్, లావోస్, లెబనాన్, మకావు, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, ఒమన్, ఫిలిప్పీన్స్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంక, తైవాన్, థాయ్‌ల్యాండ్, టర్కీ, యూఏఈ, ఒమన్‌ల్లో దీనికి సంబందించిన ఫైనల్ టెక్నికల్ టెస్టు జరగనుంది.

ఈ గేమ్ టైమ్‌లైన్ 2051లో ఉండనుంది. పబ్జీ: న్యూ స్టేట్ సరికొత్త బ్యాటిల్ రాయల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. ఇందులో కొత్త రెండరింగ్ టెక్నాలజీ, గన్ ప్లే సిస్టం ఉండనున్నాయి. ప్రస్తుతం పీసీ వెర్షన్‌కు అందుబాటులో ఉన్న పబ్జీ: బ్యాటిల్ గ్రౌండ్స్ తరహాలో దీని గేమ్ ప్లే ఉండనుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ గ్రాఫిక్స్ ఉండనున్నాయని కంపెనీ అంటోంది.

ఇందులో కోర్ పబ్జీ ఐపీ ఉండనుంది. గ్లోబల్ మార్కెట్లో పోటీ పడే విధంగా ఈ గేమ్‌ను రూపొందించినట్లు క్రాఫ్టన్ సీఈవో సీహెచ్ కిమ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు గేమ్‌ను ఎంజాయ్ చేసే విధంగా ఈ గేమ్ ఉండనుందని, మోస్ట్ పవర్‌ఫుల్ టైప్ ఆఫ్ మీడియాను దీంతో అందించనున్నామని పేర్కొన్నారు.

పబ్జీ ఒరిజినల్ గేమ్ ప్లేలో ఉన్న ఫీచర్లు మాత్రమే కాకుండా వెపన్ కస్టమైజేషన్, డ్రోన్ స్టోర్, యూనిక్ ప్లేయర్ రిక్రూట్‌మెంట్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో నాలుగు మ్యాప్‌లు ఉండనున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న పబ్జీలోని ఎరాంగిల్‌తో పాటు ట్రాయ్ అనే కొత్త మ్యాప్ కూడా ఇందులో అందించనున్నారు. అనుమతిలేని ప్రోగ్రాంలు, ఎమ్యులేటర్స్, కీబోర్డ్ అండ్ మౌస్‌లను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఆయా ఖాతాలను బహిష్కరిండచం ద్వారా హ్యాకింగ్‌ను తగ్గిస్తామని కంపెనీ అంటోంది.

Also Read: వాట్సాప్ చాటింగ్‌లు పర్మినెంట్‌గా హైడ్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే సరిపోతుంది!

Also Read: Apple Macbook Pro 2021: మోస్ట్ పవర్‌ఫుల్ యాపిల్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలుసా?

Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Oct 2021 03:46 PM (IST) Tags: PUBG New State PUBG New Game PUBG PUBG New State Release Date PUBG New State Launch PUBG New State Release

సంబంధిత కథనాలు

Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?

Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?

WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!

WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!

Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!

Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!

Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!

Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!

Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

టాప్ స్టోరీస్

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?