అన్వేషించండి

Poco C75 Launched: రూ.10 వేలలోనే 256 జీబీ ఫోన్ - పోకో సీ75 వచ్చేసింది!

Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే పోకో సీ75. ఈ ఫోన్ రూ.10 వేలలోపే ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.

Poco C75: పోకో సీ75 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ అయింది. ఇది షావోమీ సబ్సిడరీ కంపెనీ. ఈ సంవత్సరం ఆగస్టులో లాంచ్ అయిన రెడ్‌మీ 14సీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో సీ75 లాంచ్ అయింది. ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మీడియాటెక్ హీలియో జీ81 అల్ట్రా చిప్‌సెట్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ పోకో సీ75లో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్ స్కిన్‌పై ఇది రన్ కానుంది.

పోకో సీ75 ధర (Poco C75 Price)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ప్రారంభ వేరియంట్ ధర 109 డాలర్లుగా (సుమారు రూ.9,170) నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 129 డాలర్లుగా (సుమారు రూ.10,900) ఉంది. ఇవి ఎర్లీ బర్డ్ ధరలు మాత్రమే అని పోకో తెలిపింది. అంటే దీని ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉందన్న మాట. బ్లాక్, గోల్డ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

పోకో సీ75 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco C75 Specifications, Features)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 6.88 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ81 ప్రాసెసర్‌తో ఇది రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు ఆగ్జిలరీ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది.

4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలరోమీటర్, ఈ-కంపాస్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. కానీ ఈ ఫోన్‌తో పాటు ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 204 గ్రాములుగా ఉంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Poco C75 Launched: రూ.10 వేలలోనే 256 జీబీ ఫోన్ - పోకో సీ75 వచ్చేసింది!
రూ.10 వేలలోనే 256 జీబీ ఫోన్ - పోకో సీ75 వచ్చేసింది!
Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?షర్మిల డ్రామా వెనుక పెద్ద కుట్ర, నీలాంటి చెల్లి ఉన్నందుకు మాకు బాధ - భూమనSajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABPInd vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Poco C75 Launched: రూ.10 వేలలోనే 256 జీబీ ఫోన్ - పోకో సీ75 వచ్చేసింది!
రూ.10 వేలలోనే 256 జీబీ ఫోన్ - పోకో సీ75 వచ్చేసింది!
Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
Hyderabad News: రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
YS Sharmila: 'మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే' - వైఎస్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదంటూ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
'మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే' - వైఎస్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదంటూ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Honda Goldwing Tour: ఈ హోండా బైక్ రేటు ఫార్ట్యూనర్ కంటే ఘాటు - ఇండియాలో లాంచ్ - అంత స్పెషల్ ఏముందబ్బా?
ఈ హోండా బైక్ రేటు ఫార్ట్యూనర్ కంటే ఘాటు - ఇండియాలో లాంచ్ - అంత స్పెషల్ ఏముందబ్బా?
JioBharat 4G: వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ - రూ.700కే 4జీ ఫోన్!
వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ - రూ.700కే 4జీ ఫోన్!
Embed widget