అన్వేషించండి

Poco C65: 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే - పోకో సీ65 వచ్చేసింది!

Poco C65 Launch: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది.

Poco Affordable Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే పోకో  సీ65. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పోకో సీ65 పని చేయనుంది. ఏకంగా 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.

పోకో సీ65 ధర
ఈ ఫోన్ మనదేశంలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గానూ, టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. మ్యాట్ బ్లాక్, పాస్టల్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్, ఈఎంఐ లావాదేవీల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.9,999కే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ లభించనుందన్న మాట. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. దీనికి సంబంధించిన సేల్ డిసెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

పోకో సీ65 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20.6:9గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పోకో సీ65 రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Konda Sushmitha: మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
Embed widget