Minister KTR: హైదరాబాద్ కు ప్లగ్ అండ్ ప్లే... తొలి క్యాంపస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్... మంత్రి కేటీఆర్ తో సంస్థ ప్రతినిధులు భేటీ
భాగ్యనగరం జాబితాలో మరో అంతర్జాతీయ సంస్థ చేరబోతుంది. స్టార్టప్ ల ఇంక్యుబేషన్ సెంటర్ ప్లగ్ అండ్ ప్లే హైదరాబాద్ కి రాబోతుంది. మంత్రి కేటీఆర్ తో భేటీ అనంతరం సంస్థ ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని తెలిపారు.
మల్టీ నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ సంస్థలు హైదరాబాద్‌లో అడుగుపెట్టగా... తాజాగా ప్లగ్ అండ్ ప్లే కూడా ఈ జాబితాలో చేరిపోయింది. స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ సెంటర్, ఏకో సిస్టమ్‌ని డెవలప్ చేసే సంస్థల్లో ప్లగ్ అండ్ ప్లే పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ కంపెనీ ఇండియాలో తమ తొలి క్యాంపస్‌ని హైదరాబాద్ లో పెట్టేందుకు సిద్ధమవుతోంది. మంత్రి కేటీఆర్ తో ప్లగ్ అండ్ ప్లే సంస్థ ప్రతినిధులు పారిస్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ప్లగ్ అండ్ ప్లే తమ నిర్ణయాన్ని ప్రకటించింది. హైదరాబాద్‌లో దేశంలోనే పెద్దదైన టీ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉందని, ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే కూడా రావడంతో మరింత ఊతం లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Good news for #HappeningHyderabad
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 30, 2021
Another marquee organization to set foot in Hyderabad, Telangana
The world's largest leading innovation platform @PlugandPlayTC will be launching their Center in Hyderabad. The announcement came after their team met Minister @KTRTRS in Paris pic.twitter.com/rAMHZnDA8Z
Watch: ఫ్రాన్స్ పర్యటనలో డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ తో మంత్రి కేటీఆర్ సమావేశం
ఇండియాలో తొలి బ్రాంచ్
హైదరాబాద్‌లో ఏర్పాటుచేసే ప్లగ్ అండ్ ప్లే కార్యాలయం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), స్మార్ట్‌సిటీస్ మీద పని చేసే స్టార్టప్ సంస్థలకు ఇంక్యుబేషన్ సెంటర్‌గా పని చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో కృషి చేస్తున్న స్టార్టప్‌లకు ఎకో సిస్టమ్‌ని బిల్డ్ చేస్తుందన్నారు. ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ రంగాలపై ఈ సంస్థ దృష్టిపెట్టనుందని పేర్కొన్నారు.ప్లగ్ అండ్ ప్లే సంస్థ ఇప్పటి వరకు 35 వేల స్టార్టప్‌లకు అండదండలు అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో 530 కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా లీడింగ్ కంపెనీలుగా ఉన్నాయన్నారు. అమెరికా, జర్మనీ, జపాన్, చైనా, స్పెయిన్, నెదర్లాండ్స్‌లలో ఈ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఆసియాలోని జపాన్, చైనా తర్వాత భారత్ లో ప్లగ్ అండ్ ప్లే తన మూడో కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తోంది.
Also Read: టీఆర్ఎస్‌లో అసలు "వర్క్" అంతా కేటీఆర్‌దే ! ప్లీనరీ సక్సెస్‌తో మరోసారి పట్టు నిరూపించుకున్న యువనేత !
స్టార్టప్ లకు కేంద్రంగా హైదరాబాద్
1990లలో ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా బెంగళూరు ఉండేది. దీంతో విప్రో, ఇన్ఫోసిస్, ఓలా, ఫ్లిప్‌కార్ట్, బయోకాన్ ఇలా ప్రముఖ సంస్థలన్నీ బెంగళూరులో స్టార్టప్‌లుగా ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు స్టార్టప్ లే ఇవాళ భారీ కార్పొరేట్ కంపెనీలుగా ఎదిగాయి. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. టీ హబ్‌తో పాటు ప్లగ్ అండ్ ప్లే హైదరాబాద్‌కి రావడం అనేక స్టార్టప్‌లు హైదరాబాద్‌కి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఐఓటీ, మెషన్ లెర్నింగ్, అర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, మొబిలిటీ రంగాల్లో మరిన్నీ స్టార్టప్ లకు హైదరాబాద్ నిలయంగా మారే అవకాశం ఉంది.