అన్వేషించండి

OnePlus Ace 3: రూ.30 వేలలోనే వన్‌ప్లస్ కొత్త ఫోన్ - హైఎండ్ ప్రాసెసర్‌తో!

OnePlus New Phone: వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ఏస్ 3.

OnePlus Ace 3 Launched: వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. 6.78 అంగుళాల బీవోఈ ఓరియంటల్ అమోఎల్ఈడీ స్క్రీన్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో వన్‌ప్లస్ 12ఆర్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్ ఏస్ 3 ధర (OnePlus Ace 3 Price)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లుగా (సుమారు రూ.30,000) నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగానూ (సుమారు రూ.33,000), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లుగానూ (సుమారు రూ.40,000) ఉంది. చైనాలో జనవరి 15వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ మనదేశంలో ‘స్మూత్ బియాండ్ బిలీఫ్’ అనే ఈవెంట్‌ను జనవరి 23వ తేదీన నిర్వహించనుంది. న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది.

వన్‌ప్లస్ ఏస్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఓరియంటల్ అమోఎల్ఈడీ ఎల్టీపీవో డిస్‌ప్లేను అందించారు. పీక్ బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందించారు. అల్యూమినియం అల్లోయ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్లాక్‌తో ఫోన్ బిల్ట్ క్లాసీగా ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, బైదు, గ్లోనాస్, గెలీలియో, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీంతోపాటు యాక్సెలరోమీటర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, ఐఆర్ కంట్రోల్, లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 100 శాతానికి 27 నిమిషాల్లోనే ఛార్జింగ్ ఎక్కనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 207 గ్రాములుగా ఉంది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
తప్పు దిశలో పెట్టిన డెస్క్ పురోగతిని నిరోధిస్తుందా? వాస్తుతో మీ కెరీర్ ఎదుగుదల రహస్యాన్ని తెలుసుకోండి
తప్పు దిశలో పెట్టిన డెస్క్ పురోగతిని నిరోధిస్తుందా? వాస్తుతో మీ కెరీర్ ఎదుగుదల రహస్యాన్ని తెలుసుకోండి
Embed widget