ఈ సంవత్సరం వన్ ప్లస్ లాంచ్ చేయనున్న చివరి ఫోన్ ఇదే.. ధర కూడా లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 9ఆర్ టీని అక్టోబర్ 15వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర కూడా ఆన్ లైన్ లో లీకైంది.
వన్ ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన లాంచ్ తేదీని ప్రముఖ టిప్ స్టర్ షేర్ చేశారు. అక్టోబర్ 15వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. గతంలో వచ్చిన కథనాల ప్రకారం.. వన్ ప్లస్ 9ఆర్ టీ మనదేశంలో, చైనాలో మాత్రమే లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.
ప్రముఖ టిప్ స్టర్ స్టీవ్ హెమ్మర్ స్టోఫర్ వన్ ప్లస్ 9ఆర్ టీ లాంచ్ తేదీని ట్వీట్ చేశారు. అయితే వన్ ప్లస్ ఈ ఫోన్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఫోన్ ధర కూడా ఆన్ లైన్ లో లీకైంది. ఈ సంవత్సరం వన్ ప్లస్ లాంచ్ చేయనున్న ఆఖరి ఫోన్ ఇదే కానుంది.
వన్ ప్లస్ 9ఆర్ టీ ధర(అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 చైనీస్ యువాన్లుగానూ(సుమారు రూ.34,300), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 3,299 చైనీస్ యువాన్లుగానూ(సుమారు రూ.37,700) ఉండనుంది.
వన్ ప్లస్ 9ఆర్ టీ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6.55 అంగుళాల శాంసంగ్ ఈ3 ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించనున్నారు. వన్ ప్లస్ 9ఆర్ తరహాలోనే ఇందులో కూడా క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ను అందించనున్నారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించనున్నారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్481 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ను కూడా అందించనున్నారు.
4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 65W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వెబ్ సైట్లో కూడా ఈ ఫోన్ ఇటీవలే కనిపించింది.
Also Read: Realme New Phone: రూ.10 వేలలోపే రానున్న రియల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే కెమెరా!
Also Read: Samsung New Phone: శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఆ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్!