News
News
X

OnePlus 11 5G Smartphone: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..

చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ OnePlus భారత్ లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతున్నది. OnePlus 11 5G పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది.

FOLLOW US: 

ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ OnePlus ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే  అనేక ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్లను మొబైల్ ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కంపెనీ, ఇప్పుడు మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నది.  OnePlus 11 పేరుతో 5G ఫోన్ ను లాంచ్ చేయబోతున్నది. 2023 ఫస్ట్ క్వార్టర్ లో ఈ స్మార్ట్‌ ఫోన్  విడుదలయ్యే అవకాశం ఉంది.

అదిరిపోయే డిస్ ప్లే

ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పలు ఫీచర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇందులో  ప్రో లెవల్ ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ OnePlus 11 ఉత్పత్తి మొదలు పెట్టింది. డిస్ ప్లే విషయానికి వస్తే.. OnePlus 11 స్మార్ట్‌ ఫోన్ 6.7-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే తో రూపొందుతున్నది. 1440 x 3216 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ తో అందుబాటులోకి రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్  తో పాటు 526 ppi పిక్సెల్ క్వాలిటీని కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో డిస్‌ప్లే ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. 

పవర్ ఫుల్ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్

 OnePlus 11  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2  ప్రాసెసర్‌ రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 మద్దతుతో పని చేస్తుంది. 16GB RAM,  256GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.  ఇక OnePlus 11 స్మార్ట్‌ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ తో రాబోతున్నది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. మెయిన్ కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. రెండో కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ తో వస్తుంది. మూడో కెమెరా విషయానికి వస్తే  32 మెగాపిక్సెల్ 2x  లెన్స్ తో రూపొందింది. ముందు వైపు  16 మెగాపిక్సెల్ సెన్సార్‌ తో సెల్ఫీ కెమెరా రాబోతున్నది. ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.

బ్యాటరీ, కనెక్టివిటీగ

ఇక బ్యాటరీ విషయానికి వస్తే OnePlus 11 స్మార్ట్‌ ఫోన్ 5000mAh బ్యాటరీతో రూపొందింది. 100 W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPSతో పాటు USB టైప్-C పోర్ట్ ను కలిగి ఉంది. అండర్ డిస్ ప్లే,  ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరో మీటర్,  ఇ-కంపాస్, కలర్ స్పెక్ట్రమ్ సహా పలు ఫీచర్లు ఉన్నాయి.  ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి రేట్ల వివరాలు మాత్రం బయటకు రాలేదు.

News Reels

Tesla Pi 5G Phone: తెస్లా నుంచి కూడా 5 జీ ఫోన్ వస్తోంది. ఇటీవలే బార్ట్న్‌ హెయిర్‌ (Burnt Hair) పేరుతో పెర్‌ఫ్యూమ్‌ రిలీజ్‌ చేసిన టెస్లా (Tesla) కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ రంగంలోకీ అడుగు పెడుతున్నారు. Tesla Pi 5G ఫోన్‌ని పరిచయం చేయబోతున్నారు. ఎలాన్ మస్క్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందట.

మోటోరోలా సైతం అదే బాటలో: మోటొరోలా తన స్మార్ట్‌ఫోన్‌లలో భారతీయ టెలికాం ఆపరేటర్ల కోసం 5G సపోర్ట్‌ను ఎనేబుల్ చేసే సాఫ్ట్‌వేర్ రోల్ అవుట్ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది. లెనోవా యాజమాన్యంలోని మోటొరోలా భారతదేశం 5జీ సపోర్ట్‌ను తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్లాన్లు రెడీ చేసింది. సాఫ్ట్‌వేర్ రోల్‌అవుట్ యొక్క మొత్తం షెడ్యూల్‌ను ప్రకటించింది. 11 స్మార్ట్‌ఫోన్‌లకు ఈ అప్‌డేట్ రానుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే Airtel, Jio, Vi 5G సేవలను అనుమతించే OTA అప్‌డేట్‌ను అందుకోవడం ప్రారంభించాయి.

Read Also: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్, డిస్‌ప్లే ఫీచర్లు లీక్!

Published at : 18 Oct 2022 07:24 PM (IST) Tags: Oneplus OnePlus 11 5G Smartphone OnePlus 11 Features

సంబంధిత కథనాలు

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!