అన్వేషించండి

OnePlus 10 Pro Price Leak: వన్‌ప్లస్ 10 ప్రో ధర లీక్.. 9 ప్రో కంటే చాలా తక్కువకే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్‌ను జనవరి 11వ తేదీన లాంచ్ చేయనుందని తెలుస్తోంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది.

వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ జనవరి 11వ తేదీన లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే లాంచ్‌కు ముందు.. వన్‌ప్లస్ సీఈవో పీట్ లా దీని స్పెసిఫికేషన్లు టీజ్ చేశారు. అయితే ఈ ఫోన్ ధర, వేరియంట్ల వివరాలు కూడా ఇప్పుడు లీకయ్యాయి. వీటితో పాటు ఈ ఫోన్‌కు సంబంధించిన శాంపిల్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. వన్‌ప్లస్ 10 ప్రోలో వెనకవైపు హాజిల్‌బ్లాడ్ పవర్డ్ కెమెరా సెటప్‌ను ఉపయోగించారు.

వన్‌ప్లస్ 10 ప్రో ధర (అంచనా)
ఇందులో మూడు వేరియంట్లు ఉండనున్నాయని తెలుస్తోంది. లీకైన వివరాలను బట్టి.. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.46,600), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,599 యువాన్లుగానూ (సుమారు రూ.53,600), టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.58,300) ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి వన్‌ప్లస్ 10 ప్రో ధర మనదేశంలో రూ.50-55 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 9 ప్రో రూ.64,999 ధరతో మనదేశంలో లాంచ్ అయింది. ఆ ఫోన్ కంటే సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వన్ ప్లస్ 10 ప్రో ధర తగ్గే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (టీజ్ చేసినవి)
వన్‌ప్లస్ 10 ప్రో కెమెరా ఫీచర్లను కంపెనీ ఇటీవలే టీజ్ చేసింది. ఇందులో 150 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్న 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌ను అందించనున్నారు. దీంతోపాటు ఇందులో ఫిష్ ఐ మోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ కెమెరాలో 110 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండనుంది.

సెకండ్-జెన్ హాజిల్‌బ్లాడ్ ప్రో మోడ్ ద్వారా వన్‌ప్లస్ 10 ప్రోలో వినియోగదారులు 12-బిట్ రా ఫొటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. రా+ సపోర్ట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ జేపీఈజీ, రా ఇమేజెస్‌ను ఒకేసారి క్యాప్చర్ చేయగలదు. ఇందులో ఉన్న మూవీ మోడ్ ద్వారా వినియోగదారులు ఐఎస్‌వో, షట్టర్ స్పీడ్, ఇతర సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ప్రీసెట్ ప్రొఫైల్ పిక్చర్ లేకుండానే లాగ్ ఫార్మాట్‌లో వినియోగదారులు షూట్ చేయవచ్చు.

వెనకవైపు ఉన్న మూడు కెమెరాల్లోనూ 10-బిట్ కలర్ ఫొటోగ్రఫీ ఉన్న ఏకైక స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రోనే అని తెలుస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్లకు వైడర్ కలర్ గాముట్‌ను అందించనుందని తెలుస్తోంది.

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

OnePlus 10 Pro Price Leak: వన్‌ప్లస్ 10 ప్రో ధర లీక్.. 9 ప్రో కంటే చాలా తక్కువకే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Nandamuri Balakrishna: ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP DesamAniket Verma Young Super Star in SRH IPL 2025 | సన్ రైజర్స్ కొత్త సూపర్ స్టార్ అనికేత్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Nandamuri Balakrishna: ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Vaishnavi Chaitanya: కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!
కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
Embed widget