OnePlus 10 Pro: వన్‌ప్లస్ 10 ప్రో మనదేశంలో లాంచ్ అయ్యేది అప్పుడే - ఎప్పుడు రానుందో తెలుసా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మనదేశంలో త్వరలో వన్‌ప్లస్ 10 ప్రోను లాంచ్ చేయనుంది.
OnePlus 10 Pro: వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ఫస్ట్‌లుక్ జనవరిలోనే విడుదల అయింది. ఈ ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్లలో, మనదేశంలో లాంచ్ కానుంది. ఇప్పుడు తాజాగా వస్తున్న కథనం ప్రకారం... వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యే డేట్ ఫిక్స్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు.
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీన్ని ట్విట్టర్‌లో టీజ్ చేశారు. ఈ లీకుల ప్రకారం... వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 22వ తేదీ లేదా మార్చి 24వ తేదీన లాంచ్ కానుంది. వన్‌ప్లస్ సీఈవో ఈ ఫోన్ మనదేశంలో మార్చి నెలాఖరులో లాంచ్ కానుందని తెలిపారు. కానీ కచ్చితమైన తేదీని ప్రకటించలేదు.
ఈ ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే... ధర రీజనబుల్‌గానే ఉందని యోగేష్ బ్రార్ తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ ఐకూ 9 ప్రోతో పోటీ పడనుంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను వన్‌ప్లస్ ఇందులో అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో అందించారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరాను ఇందులో అందించారు. ఈ ఫోన్ 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 200.5 గ్రాములుగా ఉంది. ఇందులో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?