Nothing Phone 2a Plus: నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ వచ్చేసింది - అప్‌డేటెడ్ ఫీచర్లు, అందుబాటులో ధర!
Nothing Phone 2a Plus Launched: ఇంగ్లండ్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
Nothing Phone 2a Plus India Launch: నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్ ఫోన్‌కి అప్‌డేట్ వెర్షన్‌గా ఈ ప్లస్ మోడల్ అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో 5జీ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రన్ కానుంది. ఇందులో వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు ఒక 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఐపీ54 రేటెడ్ బిల్డ్ కూడా ఉంది.
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ధర (Nothing Phone 2a Plus Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు 7వ తేదీన జరగనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Nothing Phone 2a Plus Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టంపై నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రన్ కానుంది. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నారు. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో 5జీ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్9 సెన్సార్ అందించారు. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా కంపెనీ అందించింది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, 360 డిగ్రీ యాంటెన్నా, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, ఎలక్ట్రిక్ కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 56 నిమిషాలు పట్టనుంది.
ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, లీనియర్ హాప్టిక్ మోటార్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. అంతే కాకుండా హై డెఫినిషన్ మైక్రో ఫోన్లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో చూడవచ్చు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే