By: ABP Desam | Updated at : 21 Oct 2021 05:49 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
నోకియా సీ30 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
నోకియా సీ30 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీనిపై జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు అందించింది. ఈ సంవత్సరం జులైలో ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ అయింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ ద్వారా కొంటే రూ.1,000 వరకు తగ్గింపు లభించనుంది.
నోకియా సీ30 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. గ్రీన్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, నోకియా.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఒకవేళ మీరు జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు 10 శాతం తగ్గింపు లభించనుంది. మైజియో యాప్ ద్వారా లేదా రిటైల్ స్టోర్ల ద్వారా వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకవేళ ముందే ఫోన్ కొనుగోలు చేసినా.. ఫోన్ యాక్టివేట్ చేసిన 15 రోజుల్లోపు, మైజియో ద్వారా దీని కోసం ఎన్‌రోల్ చేసుకోవచ్చు. విజయవంతంగా ఎన్‌రోల్ చేసుకున్న అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాకు 30 నిమిషాల్లో మొత్తం ట్రాన్స్‌ఫర్ అవుతుంది. రూ.249 కంటే ఎక్కువ మొత్తంతో రీచార్జ్ చేసేవారికి మింత్రా, ఫార్మ్ఈజీ, ఓయో, మేక్ మై ట్రిప్‌లకు సంబంధించి రూ.4,000 వోచర్లు లభించనున్నాయి.
నోకియా సీ30 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.82 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 70 శాతం ఎన్‌టీఎస్‌సీ కలర్ గాముట్‌ను ఈ ఫోన్ అందించనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా దీంతోపాటు అందించనున్నారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా దీంతోపాటు అందించనున్నారు.
Also Read: Oppo K9s: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర బడ్జెట్‌లోనే.. అదిరిపోయే లుక్!
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
/body>