WhatsApp New Feature: మీరు పంపిన ఫోటో, వీడియోలను మీ అనుమతి లేకుండా ఎవరూ సేవ్, షేర్ చేయలేరు!
WhatsApp Chat Privacy New Update: వాట్సాప్, వినియోగదారుల గోప్యతకు సంబంధించి మరో అప్‌డేట్ తీసుకువస్తోంది. ఇది, మీ చాట్‌ను మరింత ప్రైవేట్‌గా మారుస్తుంది.

New Features For WhatsApp Users Privacy: వినియోగదారుల గోప్యతకు సంబంధించి వాట్సాప్‌లో మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేనప్పటికీ, మీడియాలో వస్తున్న వార్తలను బట్టి, నూతన అప్‌డేట్ చాలా అద్భుతంగా ఉండవచ్చు. ఆ అప్‌డేట్ వచ్చిన తర్వాత, మీరు పంపిన ఫోటోలు లేదా వీడియోలను మీ అనుమతి లేకుండా ఎవరూ వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేయలేరు. అంతేకాదు, ఆ ఫోటోలు లేదా వీడియోలను మీ అనుమతి లేకుండా ఇతరులకు షేర్ కూడా చేయలేరు. wabetainfo ప్రకారం, ఇది కొత్త iOS అప్‌డేట్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కాదు. దీనిని టెస్ట్ ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ కిందకు తీసుకువచ్చారు. అంటే, ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది, అందరికీ అందుబాటులోకి రాలేదు. ఇది iOSలో WhatsApp అప్‌డేట్ వెర్షన్ 25.10.10.70గా అందుబాటులో ఉంది. కావాలనుకుంటే, మీరు కూడా ఈ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఒక టెస్టర్‌గా మారవచ్చు.
మరింత ప్రైవేట్‌గా మారనున్న వాట్సాప్
ఈ కొత్త WhatsApp ఫీచర్‌తో, మీరు పంపిన ఫోటోలు & వీడియోలను ఎవరూ వాళ్ల డివైజ్‌లో సేవ్ చేయలేరు. మీ అనుమతి లేకుండా ఆ చాట్‌ను మరే ఇతర యూజర్‌కు ఫార్వార్డ్ చేయలేరు. వాట్సాప్‌లో రాబోతున్న ఈ అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవరీ ఫీచర్‌తో మీ ఛాటింగ్, మీరు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలన్నీ ప్రైవేట్‌గా మారతాయి. ఈ వాట్సాప్ అప్‌డేట్ ప్రస్తుతం టెస్ట్ ఫ్లైట్ యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత అందరు యూజర్ల కోసం మరింత అప్‌డేట్ చేస్తారు.
మీ ఫోన్‌లో మీరు అనుమతిస్తేనే అవతలి వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోగలరు. మీరు ఈ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయాలనుకుంటున్న వ్యక్తి కోసం, అతని కాంటాక్ట్‌లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ (Advanced chat privacy) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ ఫీచర్ పర్సనల్ చాట్ & గ్రూప్ చాట్ రెండింటికీ వర్తిస్తుంది. వాట్సాప్‌లోని ఈ ఫీచర్ అదృశ్యమయ్యే సందేశం (disappearing message) లాంటిది. దీన్ని ఆన్ చేస్తే, మీ చాట్ నిర్దిష్ట సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.
వాట్సాప్‌లో చాట్ లాక్ ఫీచర్ (Chat Lock feature in WhatsApp)
వాట్సాప్‌లో చాట్ లాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా ఒక ప్రైవరీ ఫీచర్. ఇది కూడా అద్భుతంగా & మ్యాజికల్‌గా ఉంటుంది. దీని సాయంతో మీరు మీ వాట్సాప్ చాట్ లిస్ట్ నుంచి ఏదైనా చాట్‌ను అదృశ్యం చేయవచ్చు. అప్పుడు, ఎవరైనా మీ వాట్సాప్‌ను ఓపెన్ చేసినా ఆ చాట్ కనిపించదు & మీ ప్రైవసీకి ఇబ్బంది రాదు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే, మీరు అదృశ్యం చేయాలనుకున్న ఛాన్‌ను ఎంచుకుని పాస్‌వర్డ్ సెట్ చేయాలి. దీంతో, ఆ చాట్ కనిపించకుండా పోతుంది. మళ్లీ మీరు ఆ చాట్‌ను చూడాలనుకున్నప్పుడు సెర్చ్ బార్‌లో అదే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి, అప్పుడు మాత్రమే హిడెన్ చాట్ అన్‌లాక్ అవుతుంది. మళ్లీ మీరు ఆ చాట్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు అది లాక్ అవుతుంది, ఎవరికీ కనిపించదు.





















