News
News
X

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

నాసా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మొదటి ప్రయోగం నేడు జరగనుంది.

FOLLOW US: 
 
ప్లానెటరీ డిఫెన్స్ మెకానిజంను పరీక్షించడానికి భూమి వైపు దూసుకుపోతున్న గ్రహశకలాన్ని మళ్లించే మిషన్ సోమవారం అమలు కానుంది. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) - NASA కోసం జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ నిర్వహించే ఈ మిషన్ చివరి దశలో ఉంది. శాస్త్రవేత్తలు పంపిన వ్యోమనౌక దాని లక్ష్యంగా ఉన్న గ్రహశకలం డైమోర్ఫోస్‌లోకి క్రాష్ కానుంది. మనదేశ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 27వ తేదీన ఉదయం 4.44 గంటలకు ఈ క్రాష్ జరుగుతుంది. దాదాపుగా వెండింగ్ మెషీన్ ఆకారంలో, క్యూబ్ షేప్‌లో ఉన్న "ఇంపాక్టర్" వాహనం ఉల్కలోకి ఎగరనుంది. భూమికి దాదాపు 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఫుట్ బాల్ స్టేడియం సైజులో ఈ ఆస్టరాయిడ్ ఉంది.

ఈ గ్రహశకలం మన గ్రహానికి ఎటువంటి ముప్పును కలిగించదని గమనించాలి. మిషన్ ఫలితం కూడా దానిని మార్చబోదు. ఇది ఒక గ్రహశకలం ట్రాజెక్టరీని ఇది మారుస్తుందా లేదా అని పరీక్షించడం మాత్రమే ఈ మిషన్ లక్ష్యం. అధిక వేగంతో వచ్చే ఈ ఆస్టరాయిడ్ మన గ్రహానికి హాని కలగకుండా ఉంచడానికి సరిపోతుంది.

ఈ ఇంపాక్ట్‌ను ఎలా చూడాలి?
DART మిషన్ కోసం ఉపయోగించే వ్యోమనౌక దాని స్వంత కెమెరాను కలిగి ఉంది. అంటే ప్రజలు దీన్ని చూడవచ్చు. భారతదేశ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు దీని కవరేజ్ ప్రారంభం కానుంది. ఈవెంట్ ప్రత్యక్ష ప్రసార కవరేజీ NASA వెబ్‌సైట్, YouTube ఛానెల్‌తో పాటు దాని Facebook పేజీ, Twitter హ్యాండిల్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రహశకలం లేదా ఏదైనా ఖగోళ వస్తువు యొక్క కదలికను మార్చడానికి ఇది మన శాస్త్రవేత్తల మొదటి ప్రయత్నం.

DART అంటే ఏమిటి?
DART(డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ సిస్టమ్) అనేది భూమిని ఢీకొనేందుకు వచ్చే మార్గంలో ఉన్న ఏదైనా గ్రహశకలాన్ని దారి మళ్లించే లక్ష్యంతో NASA నిర్మించిన అంతరిక్ష నౌక. మేరీల్యాండ్‌లోని లారెల్‌లోని జాన్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ (APL)లో నిర్మించబడిన DART స్పేస్‌క్రాఫ్ట్. భూమిని చేరుకోవడానికి రెడీగా ఆస్టరాయిడ్ వైపు DART స్పేస్‌క్రాఫ్ట్ ప్రయాణిస్తుంది. దాని చుట్టూ చిన్న ఉపగ్రహాన్ని (క్యూబ్‌శాట్) మోహరిస్తుంది. టార్గెట్ చేసిన గ్రహశకలం చుట్టూ తిరుగుతుంది. సమాచారాన్ని సేకరిస్తుంది. డేటా, చిత్రాలను సేకరించిన తర్వాత స్పేస్‌ క్రాఫ్ట్ ఆస్టరాయిడ్‌లోకి దూసుకుపోతుంది. ఆ తర్వాత గ్రహశకలాన్ని బ్లాస్ట్ చేస్తుంది. ఫలితంగా భూమికి జరగబోయే నష్టాన్ని నివారిస్తుంది. 

News Reels

మేరీల్యాండ్‌ లారెల్‌ లోని జాన్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ (APL)లో DART స్పేస్‌ క్రాఫ్ట్2ను రూపొందించారు. వాస్తవానికి చాలా గ్రహ శకలాలు మన భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం రావచ్చని ముందే గ్రహించిన శాస్త్రవేత్తలు.. ఈ అంతరిక్ష నౌకను రూపొందించారు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టడం మూలంగానే డైనోసార్లు అంతరించిపోయాయని పరిశోధకులు చెప్తుంటారు. అలాంటి ముప్పు నుంచి భూమిని కాపాడేందుకే నాసా DART అంతరిక్ష నౌకను రూపొందించింది.  

Published at : 26 Sep 2022 09:10 PM (IST) Tags: NASA Asteroid NASA's DART Spacecraft science news

సంబంధిత కథనాలు

Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

Telegram Premium: ఆరు నెలల్లోనే 10 లక్షలు - టెలిగ్రాం కొత్త రికార్డు - ఇది మీ దగ్గర కూడా ఉందా?

Telegram Premium: ఆరు నెలల్లోనే 10 లక్షలు - టెలిగ్రాం కొత్త రికార్డు - ఇది మీ దగ్గర కూడా ఉందా?

Tecno Pova 4: రూ.12 వేలలోపే 8 జీబీ ర్యామ్ ఫోన్ - శాంసంగ్, నోకియా బడ్జెట్ ఫోన్లతో పోటీ!

Tecno Pova 4: రూ.12 వేలలోపే 8 జీబీ ర్యామ్ ఫోన్ - శాంసంగ్, నోకియా బడ్జెట్ ఫోన్లతో పోటీ!

బడ్జెట్ రేంజ్‌లో టాప్ స్మార్ట్ ఫోన్లు - 2022లో రూ.10 వేలలోపు ఇవే బెస్ట్!

బడ్జెట్ రేంజ్‌లో టాప్ స్మార్ట్ ఫోన్లు - 2022లో రూ.10 వేలలోపు ఇవే బెస్ట్!

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

టాప్ స్టోరీస్

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !