Jio OTT Plans: గుడ్ న్యూస్ చెప్పిన JIO, ఇకపై ఈ ప్లాన్లకూ ఫ్రీగా Netflix సబ్‌స్క్రిప్షన్
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా రెండు అదిరిపోయే ప్లాన్లను ప్రకటించింది. వీటి ద్వారా ఉచితంగా ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ పొందే అవకాశం కల్పిస్తోంది.
కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేలా సరికొత్త ప్లాన్లు రూపొందించడంలో రిలయన్స్ జియో ముందుంటుంది. అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. కొత్త కస్టమర్లను పెంచుకునేందుకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఇప్పటికే మోబైల్ పోస్ట్ పెయిడ్, ఫైబర బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లతో ఉచితంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. తాజాగా ప్రీ పెయిడ్ ప్లాన్స్ కు సైతం ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.
జియో నుంచి సరికొత్త నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు
కరోనా అనంతరం భారత్ లో ఓటీటీలకు భారీగా ఆదరణ పెరుగుతోంది. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీలకు ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ లభిస్తోంది. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలు తమ కస్టమర్లకు చక్కటి కంటెంట్ అందిస్తూ దూసుకెళ్తున్నాయి. వీటిలో నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య మంచి ఆరణ పొందుతోంది. డిమాండ్ తో పాటు సబ్ స్క్రిప్షన్ ఫీజు కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తోంది రిలయన్స్ జియో. ఈ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ద్వారా వినియోగదారులను పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రిలయన్స్ జియో ఫైబర్, మొబైల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించింది. ఇప్పుడు తాజాగా ప్రీ పెయిడ్ ప్లాన్లకు కూడా నెట్ ఫ్లిక్స్ ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
1. రిలయన్స్ జియో మొదటి ప్లాన్ రూ.1099
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనితో వినియోగదారులు రోజుకు 2GB డేటా పొందుతారు. 5G వెల్ కమ్ ఆఫర్ కింద అపరిమిత 5G డేటాను పొందే అవకాశం ఉంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు రోజు 100 SMSలు పంపుకోవచ్చు. జియో యాప్‌లను పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్ తీసుకునే వినియోగదారులు మొబైల్ ద్వారా ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
2. రిలయన్స్ జియో రెండో ప్లాన్ రూ. 1499
ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులు ఉంటుంది. రోజుకు 3GB డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 5G వెల్ కమ్ ఆఫర్ కింద అపరిమిత 5G డేటా పొందవచ్చు. రోజుకు 100 SMSలు పంపుకోవచ్చు. Jio యాప్‌లను పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్ తీసుకునే వినియోగదారులు మొబైల్ ద్వారా ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మొత్తంగా రిలయన్స్ తీసుకొచ్చిన తాజా ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా ఇటు జియోతో పాటు అటు నెట్ ఫ్లిక్స్ వినయోగదారులు భారీగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి - లేకపోతే డేటా లీక్ అయ్యే అవకాశం!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial