Moto Edge 30 Ultra: ఇక ఇండియాలోనూ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సేల్స్, 200 మెగాపిక్సిల్ కెమెరా, అద్భుత ఫీచర్స్!
మోటోరోలా కంపెనీ నుంచి ప్రీమియమ్ ఫ్లాగ్ షిప్ మొబైల్ గా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా విడుదల అయ్యింది. భారత్ లో తొలిసారి 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
మోటోరోలా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ప్రీమియమ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో అడుగుపెట్టింది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో వినియోగదారుల ముందుకు వచ్చింది. భారత్ లో విడుదలైన తొలి 200 మెగా ఫిక్సెల్ కెమెరా ఫోన్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. క్వాల్ కామ్ పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో పాటు ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ కు సంబంధించిన ధర, సేల్, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్పెసిఫికేషన్లు
మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 6.67 ఫుల్ హెచ్‌డీ+ OLED కర్వ్‌డ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 144Hz రిఫ్రెష్ రేట్, 1250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్ 10+, డీసీఐ-పీ3ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను పొందుతుంది. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ను కలిగి ఉంది. LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో ప్యాక్ చేసి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 200 మెగాపిక్సెల్ సామ్ సంగ్ సెన్సార్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ను కలిగి ఉంది. ఇక 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60 మెగా పిక్సెల్ కెమెరాను పొంది ఉంది.
ఇక లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇందులో 4,610mAh బ్యాటరీ ఉంటుంది. 125 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50 వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్, 10 వాట్స్ వైర్‌లెస్ పవర్ షేరింగ్ సపోర్ట్ ను సైతం పొంది ఉంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, లైనర్ ఎక్స్ యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ ను కలిగి ఉంటుంది. 13 బ్యాండ్స్ 5జీ, 4జీ ఎల్ఈటీ, వైఫై 6 ఈ, బ్లూటూత్ వెర్షన్ 5.2, జీపీఎస్, డిస్‌ప్లే పోర్ట్ 1.4, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.
ధర ఎంత? సేల్ ఎప్పటి నుంచంటే?
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ లో ఈనెల 22న తొలి సేల్‌కు రానుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.54,999కు అందుబాటులో ఉండనుంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‍లైట్ వైట్ కలర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 30 మొబైల్ కొనుగోలుతో పలు ఆఫర్లు లభిస్తున్నాయి. దీని కొనుగోలు ద్వారా జియోకు సంబంధించి రూ.14,699 ఆఫర్స్ అందుకునే అవకాశం ఉందని మోటోరోలా వెల్లడించింది. అందులో రూ.100 విలువైన 40 జియో రీచార్జ్ వోచర్లు లభించనున్నాయి. మింత్రా, జీ5, ఇక్సిగో, ఫెర్న్స్ & పెటల్స్ కు సంబంధించిన పలు కూపన్లు లభించనున్నాయి.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?