అన్వేషించండి

Motorola Edge 50 Neo : లాంచ్​కు ముందే లీకైన వివరాలు - అదిరిపోయే ఫీచర్లతో సూపర్ స్మార్ట్ ఫోన్!

మోటోరోలా మరో సరికొత్త ఫోన్​ను తీసుకువస్తోంది. రీసెంట్​గానే మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా, మోటోరోలా రేజర్​ 50 సిరీస్​ తీసుకొచ్చిన సదరు కంపెనీ ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్​ 50 నియోను తీసుకురానుంది

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా తమ కస్టమర్ల సంఖ్య పెంచేందుకు, వారిని ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను భారత మార్కెట్​లోకి విడుదల చేస్తూ వస్తోంది. అలా తాజాగా ఇప్పుడు మరో సరికొత్త ఫోన్​ను తీసుకువస్తోంది. రీసెంట్​గానే మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా, మోటోరోలా రేజర్​ 50 సిరీస్​ తీసుకొచ్చిన సదరు కంపెనీ ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్​ 50 నియోను తీసుకురానుంది. గతేడాది తీసుకొచ్చిన ఏడ్జ్ 40 నియోకు లేటెస్ట్ మోడల్​గా దీన్ని తీసుకురానుంది.​ అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రానప్పటికీ ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్స్​కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్స్​ 

డిస్​ప్లే - 91 మొబైల్స్​ రిపోర్ట్​ ప్రకారం.. 120Hz​ రిఫ్రెష్ రేట్​తో 6.4 ఇంచ్​ పీఓపీఎల్​ఈడీ డిస్​ప్లే ఈ ఫోన్​కు ఉంది. ఇది స్మూత్ స్క్రోలింగ్​తో పాటు మంచి వ్యూయింగ్​ అనుభవాన్ని అందించనుంది. గ్రాఫిక్స్​ ఇంటెన్సివ్​ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్​సెట్, మాల్​​- G615 GPUతో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ఇదే ప్రొసేసర్​ గత నెలలో విడుదలైన సీఎమ్​ఎఫ్​ ఫోన్​ 1కు కూడా ఉంది.

కెమెరా, బ్యాటరీ 

ఈ ఎడ్జ్ 50 నియోకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మె గాపిక్సెల్, 10 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్లు, అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్  4,310 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో నడుస్తుంది.

డిజైన్ అండ్ బిల్డ్

ఈ స్మార్ట్ ఫోన్​కు 8GB ర్యామ్, 256 GB స్టోరేజ్​ సపోర్ట్ కూడా ఉంది. అలానే లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్​ ఆధారిత హెలో యూఐ మీద ఇది నడుస్తుంది. వాటర్​-డస్ట్​ రెసిస్టెన్స్​తో రానున్న ఈ ఫోన్​ ఐపీ68 రేటింగ్​ను కలిగి ఉంది. 8.1 ఎంఎం మందం, 171 గ్రాముల బరువుతో రానున్న ఈ ఫోన్  సొగసైన, తేలికపాటి డిజైన్​ను కలిగి ఉంటుందని సమాచారం. నాలుగు రకాల రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

ధర ఎంతంటే? 

మొత్తంగా అదిరే స్టైలిష్, రిచ్​ ఫీచర్స్​తో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ ఫోన్​ అద్భుతమైన పనితీరుతో ఉంటుందని అంటున్నారు. అయితే దీని ధర, లభ్యత వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ, త్వరలో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక గతేడాది విడుదలైన  ఎడ్జ్ 40 నియో 8GB RAM/128GB స్టోరేజ్ రూ.22,999 ధరకు లభించగా, 12GB ర్యామ్​ వేరియంట్ రూ.24,999కు అందుబాటులో ఉంది. ఇంచుమించు ఎడ్జ్​ 50 నియో ధర కూడా ఇంతే ఉండనున్నట్లు సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget