Motorola Edge 50: బ్లాక్‌బస్టర్ ఎడ్జ్ సిరీస్‌లో కొత్త ఫోన్ - మోటొరోలా ఎడ్జ్ 50 వచ్చేసింది - ధర, ఫీచర్లు ఇవే!
Motorola Edge 50 Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే మోటొరోలా ఎడ్జ్ 50. దీని ధర రూ.27,999గా నిర్ణయించారు.
Motorola New Phone: మోటొరోలా ఎడ్జ్ 50 (Motorola Edge 50) స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్. ఐపీ68 రేటెడ్ బిల్డ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 700సీ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 10 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ కూడా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సెలరేటెడ్ ఎడిషన్ చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ లైనప్‌లో ఉన్నాయి.
మోటొరోలా ఎడ్జ్ 50 ధర (Motorola Edge 50 Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, మోటొరోలా ఇండియా వెబ్‌సైట్లలో దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. యాక్సిస్ బ్యాంకు లేదా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీని ధర రూ.25,999కు తగ్గనుంది.
జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ బజ్, కోలా గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటిలో జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ బజ్ కలర్ ఆప్షన్లు వెగాన్ లెదర్ ఫినిష్‌తో రానున్నాయి. కోలా గ్రే కలర్ ఆప్షన్‌ను వెగాన్ సూడే ఫినిష్‌తో కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
మోటొరోలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Motorola Edge 50 Specifications)
ఇందులో 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్‌డీ పీఓఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ ఆఫర్ చేయనుంది. దీంతోపాటు హెచ్‌డీఆర్10+ సపోర్ట్, ఎస్‌జీఎస్ బ్లూ లైట్ రెడక్షన్ సర్టిఫికెట్ కూడా ఉంది. స్మార్ట్ వాటర్ టచ్ టెక్నాలజీ ద్వారా తడి చేతులతో కూడా దీన్ని ఆపరేట్ చేయవచ్చు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఏఈ (యాక్సెలరేషన్ ఎడిషన్) ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 50 రన్ కానుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 700సీ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 10 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ కూడా ఉంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా వైడ్ షాట్లు తీయవచ్చు. ముందువైపు ఉన్న 32 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.
డాల్బీ అట్మాస్ బ్యాక్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‌లో అందించారు. ఐపీ68 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా మోటొరోలా ఎడ్జ్ 50 పొందింది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్‌ను అన్ లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే