YouTube Shorts: ఎడిటింగ్ యాప్స్ పక్కన పెట్టేయడమే! YouTube Shortsలో సరికొత్త ఫీచర్!
YouTube Shorts: YouTube తన Shorts క్రియేటర్స్ కోసం కొత్త టూల్స్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో ఓ ఎడిట్ షూట్ మీ మొబైల్‌లో ఉన్నట్టు అని చెబుతోంది.

YouTube Shorts: క్రియేటర్ల కోసం YouTube సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది . ముఖ్యంగా Shorts క్రియేట్ చేసే వాళ్లకు కీలకమైన అప్‌డేట్ ఇది. అద్భుతమైన టూల్స్ షార్ట్స్‌లో జోడించనుంది. వీడియో ఎడిటింగ్‌ను మరింత ఈజీ చేయడంతోపాటు వాటిని మరింత ఫన్‌గా మార్చేందుకు కూడా ఈ ఫీచర్స్ యూజ్ అవుతాయి. ఇందులో లేటెస్ట్ వీడియో ఎడిటర్, AI స్టిక్కర్లు, ఇమేజ్ స్టిక్కర్లు, టెంప్లేట్‌లు, బీజీలతో దుమ్మురేపే ఫీచర్‌లు ఉంటాయి. త్వరలో కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వస్తాయని YouTube ప్రకటించింది.
జేబులో ఎడిట్ షూట్ ఉన్నట్టే!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం...YouTube తన Shorts ఫార్మాట్‌లో ఇచ్చిన ఎడిట్ షూట్ గతం కంటే చాలా భిన్నంగా ఉందని తెలుస్తోంది. కొత్త ఎడిటర్‌లో, క్రియేటర్లు తమ వీడియోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. వీడియోలను జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడం, స్నాప్ చేయడం, అలైన్ మార్చడం, క్లిప్‌లను తొలగించడం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం, టెక్స్ట్ జోడించే సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటుంది. రాబోయే కాలంలో యాప్‌లో ఎడిటింగ్ మరింత సులభతరం చేయబోతున్నట్టు YouTube చెబుతోంది.
టెంప్లేట్‌ల ఫీచర్
ఇప్పుడు క్రియేటర్లు తమ వద్ద ఉన్న ఫొటోలను గ్యాలరీ నుంచి ఎంచుకుని వాటిని రెడీమేడ్ టెంప్లేట్‌లకు జోడించి ఎడిట్ చేయగలరు. ఈ టెంప్లేట్‌లకు ఎఫెక్ట్‌లను కూడా యాడ్ చేసే సౌకర్యాన్ని కూడా YouTube పరిచయం చేయబోతోంది. ఇక్కడ మీరు ఉపయోగించే టెంప్లేట్ క్రియేటర్లకు ఆటోమెటిక్‌గా క్రెడిట్ యూట్యూబే ఇచ్చేస్తుంది. ఇమేజ్ స్టిక్కర్ల ఫీచర్ వినియోగదారులు తమ వీడియోలకు అందమైన డిజైన్లు చేయవచ్చు. అందుకు అవసరమైన ఇమేజ్ స్టిక్కర్లు సిద్ధం చేసి ఉంచుతుంది.
AI స్టిక్కర్లు లభిస్తాయి
AI ఆధారిత స్టిక్కర్లను పరిచయం చేయాలని YouTube యోచిస్తోంది. టెక్స్ట్ కమాండ్‌లు ఇస్తే కావాల్సిన స్టిక్కర్లు సృష్టించుకోగలుగుతారు. ఇది వీడియోలకు యాడ్‌వాల్యూ జోడించినట్టు అవుతుంది. తమ వీడియో క్లిప్‌లను మ్యూజిక్ బీట్‌లతో మాన్యువల్‌గా సరిపోల్చాల్సిన అవసరం లేదు. ఎంచుకున్న పాట బీట్‌తో వీడియోను సింక్ చేసే కొత్త ఫీచర్‌ను YouTube పరిచయం చేయబోతోంది. ఇది ఎడిటింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది. అంతే కాకుండా వీడియో మరింత ప్రొఫెషనల్‌గా మారనుంది.
ఈ ఫీచర్స్ ఇప్పటికే చాలా వరకు Instagram, టిక్‌టాక్‌లలో ఉన్నాయి. వాటి నుంచి స్ఫూర్తితోనే YouTube Shorts కొత్త ఫీచర్ల సూట్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విభాగంలో అధునాతనమైన ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. దీంతో షార్ట్స్ విషయంలో మాత్రం యూట్యూబ్ వెనకుబడే ఉంది. ఆ అంతరాన్ని తగ్గించేందుకు వారం పదిరోజుల్లో కొత్త ఫీచర్స్ ప్రజలక ముందుకు తీసుకురానుంది.
రీల్స్ కాన్సెప్టు కూడా ఇన్‌స్టా, టిక్‌టాక్ నుంచే యూట్యూబ్ తీసుకుంది. ఈ రీల్స్ ఫీచర్‌ను 2020లో యూట్యూబ్ ప్రవేశ పెట్టింది. ఇది చాలా తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ప్రతి రోజూ 90 బిలియన్లకుపై వీక్షకులు YouTube Shortsను చూస్తున్నారు. ఇది ఇన్‌స్టాతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉందని ఆ సంస్థ భావించి మార్పులు చేర్పులకు సిద్ధమైంది. జనాలను మరింత ఎంగేజ్ చేయడానికి కొత్త డెవలప్‌మెంట్స్ చేస్తోంది.
పోటీని మరింత దీటుగా ఎదుర్కొనేందుకు YouTube Shortsలో అప్‌డేటెడ్ ఎడిటర్, బీట్ సింగ్ కెపాసిటీ, ఏఐ జనరేటెడ్ స్టిక్కర్స్, ఫొటో ఇంటిగ్రేషన్ ఫీచరర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్స్‌పై యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జోహన్నా వూలిచ్ ఓ ప్రకటన విడుదల చేశారు. "క్రియేటర్ల ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాం. షార్ట్స్‌ను వెంటనే ఎడిట్ చేసే టూల్‌గా కాకుండా స్టోరీ చెప్పేందుకు ఇదో కాన్వాస్‌గా ఉపయోగపడాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం" అని అన్నారు.
యూట్యూబ్ షార్ట్స్ కొత్త ఫీచర్స్ ఎలా పని చేస్తాయి?
యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్‌పై ప్రెస్ చేయాలి. దీంతో అందులో లేటెస్ట్ అప్‌డేట్స్ మిమ్మల్ని ఆహ్వానం పలుకుతాయి.





















