By: ABP Desam | Updated at : 20 May 2022 11:27 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో వై75 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
వివో వై75 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ వై-సిరీస్‌లో లాంచ్ అయిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ డిజైన్ సన్నగా ఉండనుంది. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
వివో వై75 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. డాన్సింగ్ వేవ్స్, మూన్‌లైట్ షాడో కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది.
వివో వై75 ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌లో ఉపయోగించని డేటా నుంచి 4 జీబీని ర్యామ్‌గా వాడుకోవచ్చు. అంటే మొత్తంగా 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.1, వైఫై, జీపీఎస్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4050 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.74 సెంటీమీటర్లుగానూ, బరువు 172 గ్రాములుగానూ ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Xiaomi 12S Ultra: వన్‌ప్లస్, యాపిల్‌తో పోటీ పడే ఫోన్ లాంచ్ చేసిన షియోమీ!
Xiaomi 12S Pro: మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో వచ్చిన షియోమీ 12ఎస్ ప్రో - ఎలా ఉందో తెలుసా?
Xiaomi 12S: 512 జీబీ స్టోరేజ్‌తో షియోమీ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
Moto G42: రూ.14 వేలలోపే మోటో కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీలతో!
Redmi K50i: రెడ్మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 64 మెగాపిక్సెల్ కెమెరాతో!
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?