News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vivo Y16: రూ.13 వేలలోపే వివో కొత్త ఫోన్ - సైలెంట్‌గా లాంచ్ చేసిన కంపెనీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వై16ను మనదేశంలో లాంచ్ చేసింది.

FOLLOW US: 
Share:

వివో వై16 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా మనదేశంలో లాంచ్ అయింది. 4జీ కనెక్టివిటీతో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను అందించారు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. మోటో జీ52, రెడ్‌మీ నోట్ 10ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22లతో ఈ ఫోన్ పోటీ పడనుంది.

వివో వై16 ధర
ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.12,499గా నిర్ణయించారు. డ్రిజ్లింగ్ గోల్డ్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. వివో దీని కాన్ఫిగరేషన్ ఆప్షన్లను ఇంకా రివీల్ చేయాల్సి ఉంది.

వివో వై16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ద్వారా ఈ ఫోన్ ఆపరేట్ చేయవచ్చు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పనోరమ, ఫేస్ బ్యూటీ, లైవ్ ఫొటో, టైమ్ ల్యాప్స్ తరహా ఫీచర్లు ఇందులో అందించారు.

5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 18 గంటల వీడియో స్ట్రీమింగ్‌ను ఈ ఫోన్ అందించనుందని కంపెనీ అంటోంది. 10W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

వివో టీ1ఎక్స్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.

ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 22 Sep 2022 06:29 PM (IST) Tags: Vivo New Phone Vivo Y16 Price in India Vivo Y16 Vivo Y16 Features Vivo Y16 Specifications Vivo Y16 Launched

ఇవి కూడా చూడండి

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!

Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!