By: ABP Desam | Updated at : 22 Sep 2022 10:01 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో ఎక్స్80 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.
వివో ఎక్స్80 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ చెక్ రిపబ్లిక్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ కంపెనీ ఆన్‌లైన్ రిటైల్ వెబ్ సైట్లో కూడా కనిపించింది. రెండు కలర్ ఆప్షన్లు, ఒక స్టోరేజ్ వేరియంట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
వివో ఎక్స్80 లైట్ 5జీ ధర
ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 9,999 చెక్ కొరునాలుగా (మనదేశ కరెన్సీలో రూ.32,100) నిర్ణయించారు. డైమండ్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
వివో ఎక్స్80 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.44 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+ కాగా, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ సపోర్ట్ కూడా ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్‌లను ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెక్యూరిటీ కోసం అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?
Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?
Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
/body>