అన్వేషించండి

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!

వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. అదే వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్.

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లో 8.03 అంగుళాల అమోఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. కవర్ డిస్‌ప్లేగా 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4730 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లు (సుమారు రూ.1,15,000) కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 యువాన్లుగా (సుమారు రూ.1,25,000) ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 8.03 అంగుళాల అమోఎల్ఈడీ ప్రైమరీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2కే ప్లస్‌గా ఉంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. దీంతోపాటు 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కూడా అందించారు. గేమో మోడ్ ద్వారా రిఫ్రెష్ రేట్‌ను 120 హెర్ట్జ్ నుంచి 140 హెర్ట్జ్, 240 హెర్ట్జ్‌కు పెంచుకోవచ్చు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4730 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ మందం మడిచినప్పుడు 1.49 సెంటీమీటర్లు గానూ, ఓపెన్ చేసినప్పుడు 0.74 సెంటీమీటర్లుగానూ ఉంది. బరువు దాదాపు 311 గ్రాములు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫేషియల్ రికగ్నిషన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను ఇందులో అందించారు.

5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్‌లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన వివో ఎక్స్ ఫోల్డ్ తరహాలోనే ఇందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. పైన చెప్పినట్లు ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. 

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget