Vivo V29e: వివో వీ29ఈ సేల్ ప్రారంభం - కెమెరాలు అదుర్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ వీ29ఈ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. వివో వీ29 సిరీస్‌లో ఈ ఫోన్ ఇటీవలే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లో గ్లోబల్ లాంచ్ అయిన వివో వీ29 లైట్ 5జీ తరహాలోనే దీని ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను వివో వీ29ఈ సపోర్ట్ చేయనుంది.
వివో వీ29ఈ ధర, సేల్ వివరాలు
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.28,999గా నిర్ణయించారు. ఆర్టిస్టిక్ బ్లూ, ఆర్టిస్టిక్ రెడ్ కలర్ ఆప్షన్లలో వివో వీ29ఈ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ కూడా ప్రారంభం అయ్యాయి. వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వీ29ఈ కొనుగోలుపై రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్ లభించనుంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో రూ.2,500 తగ్గింపు కూడా అందించనున్నారు. కానీ రూ.30 వేలలోపు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోన్ ఇదేనా అంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఐకూ నియో 7, రియల్‌మీ 11 ప్రో ప్లస్, పోకో ఎఫ్5 5జీ, మోటొరోలా ఎడ్జ్ 40లతో వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ పోటీ పడనుంది.
వివో వీ29ఈ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. డిస్‌ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గా ఉండనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై వివో వీ29ఈ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై వివో వీ29ఈ రన్ కానుంది.
వివో వీ29ఈ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 180.5 గ్రాములుగా ఉంది.
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial