అన్వేషించండి

Top 10 Youtubers In World: ప్రపంచంలో అత్యధిక సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న టాప్ 10 యూట్యూబర్‌లు వీళ్లే, భారత్‌ నుంచి ఎన్ని ఛానెల్స్‌ ఉన్నాయో తెలుసా?

Top 10 Youtubers In World: అత్యధికంగా సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్స్ గురించి తెలుసా? ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్‌లో టాప్ 10 ఛానెల్‌ల జాబితా చూద్దాం. అందులో ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం.

Most Subscribed Channels On Youtube: YouTube వచ్చిన తర్వాత మారుమూల పల్లెల్లో ఉన్న ట్యాలెంట్‌ వెలుగులోకి వస్తోంది. రాత్రికి రాత్రే స్టార్లు అవుతున్న వారిని చూస్తున్నాం. ఒకప్పుడు ఎంటర్‌టైన్మెంట్ కోసం చూసే ఈ సోషల్ మీడియా ఇప్పుడు డబ్బులు కూడా సంపాదించి పెడుతోంది. 

ఇప్పుడు డబ్బులు సంపాదించడమే కాకుండా ఎవర్ని ఎంత మంది ఫాలో అవుతున్నారో అనే కాంపిటీషన్ కూడా ఛానెల్స్ మధ్య ఉంటోంది. ఎవరు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే వారు తోపు అన్నట్టు వాళ్లకే ఎక్కువ డబ్బులు వస్తాయని అంటారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఛానెల్స్‌లో ఎవరు ఎక్కువ సబ్‌స్క్రైబర్స్‌ కలిగి ఉన్నారో ఒక లుక్కేద్దాం. 

ఇటీవల టాప్ 10 అత్యధికంగా సబ్‌స్క్రైబ్ చేసిన ఛానెల్‌ల జాబితాలో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. టాప్ టెన్‌లో ఉన్న ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన PewDiePie ఇప్పుడు టాప్ 10లో చోటు సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం ఏ ఛానెల్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి? వాటిని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకుందాం.

MrBeast

MrBeast అసలు పేరు Jimmy Donaldson. ప్రస్తుతం YouTubeలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి. అతని పెద్ద స్టంట్స్, ఉదారత, గేమింగ్ వీడియోలు అతన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంటెంట్ క్రియేటర్‌గా మార్చాయి. అతను ఇప్పుడు యూట్యూబర్ మాత్రమే కాదు, "Feastables" వంటి తన ఉత్పత్తులతో ఒక బ్రాండ్ కూడా అయ్యాడు. వీరికి 408 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

T-Series

భారతదేశ మ్యూజిక్ ఛానెల్ T-Series హిందీ పాటలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఛానెల్ బాలీవుడ్ కొత్త, పాత పాటలకు అతిపెద్ద వేదిక. భారతదేశ సంగీత పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ ఛానెల్‌కు 297 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

Cocomelon

2 నుంచి 5 సంవత్సరాల పిల్లల కోసం రూపొందించిన ఈ ఛానెల్‌లో యానిమేటెడ్ 3D నర్సరీ రైమ్స్ ఉంటాయి. ఇందులో మనుషులు, జంతువులను రోజువారీ జీవితంలోని వివిధ సన్నివేశాలను చూపిస్తారు. ఈ ఛానెల్‌లో 194 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

SET India

Sony Entertainment Television అంటే SET India, టీవీ షోల వీడియోలను YouTubeలో అప్‌లోడ్ చేసే మరో భారతీయ ఛానెల్. దీని ప్రజాదరణ పొందిన డ్రామా, కామెడీ షోల కారణంగా వీక్షకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ ఛానెల్‌కు 184 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

Vlad And Niki

ఈ ఛానెల్ చిన్న పిల్లలకు ఆటల ద్వారా రోజు వారి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. చేతులు కడుక్కోవడం లేదా స్నేహితులకు సహాయం చేయడం వంటి రోజువారీ అవసరాలు నేర్పుతుంది. వారి కంటెంట్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా ఆకర్షణీయమైంది. ఈ ఛానెల్‌కు 141 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

Kids Diana Show

డయానా, ఆమె సోదరుడు రోమా ఈ ఛానెల్ స్టార్ట్ చేశారు. పిల్లల బొమ్మల అన్‌బాక్సింగ్, రోల్-ప్లే, చిన్న వ్లాగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది పూర్తిగా కుటుంబ-స్నేహపూర్వక ఛానెల్. ఈ చిన్నారి ఛానెల్‌కు 135 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

Like Nastya

Nastya తన ఛానెల్‌లో బొమ్మలతో ఆడుకుంటుంది, కొత్త విషయాలను అన్‌బాక్స్ చేస్తుంది. పిల్లలకు నేర్చుకునే కంటెంట్‌ను అందిస్తుంది. ఆమె ఛానెల్ చాలా సృజనాత్మకంగా, సరదాగా ఉంటుంది. ఈ ఛానెల్‌లో 128 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

Stokes Twins

Alan, Alex Stokes తమ ప్రాంక్‌లు, ఇంటర్నెట్ మిత్‌లు, ప్రోడెక్ట్‌ రివ్యూలకు ప్రసిద్ధి చెందారు. వారి ఫన్నీ కంటెంట్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ఛానెల్‌లో 127 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

Zee Music Company

T-Series వలె, Zee Music కూడా ఒక పెద్ద భారతీయ సంగీత ఛానెల్, ఇది ప్రసిద్ధ హిందీ పాటలకు నిలయం. జీ ఛానెల్‌లో 118 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు, వీరు వారి కంటెంట్‌ను బాగా ఇష్టపడుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Winter Skin Care Tips : చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Embed widget