By: ABP Desam | Updated at : 10 Dec 2022 10:03 PM (IST)
టెక్నో ఫాంటం ఎక్స్2 ప్రో లాంచ్ అయింది.
టెక్నో తన ఫాంటం ఎక్స్ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే టెక్నో ఫాంటం ఎక్స్2 ప్రో. ఈ ఫోన్ ప్రస్తుతానికి సౌదీ అరేబియాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి రిట్రాక్టబుల్ పొర్టట్రెయిట్ లెన్స్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ అయింది. కర్వ్‌డ్ ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ ఇందులో అందించడం విశేషం. ఒకవేళ ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 10టీ ప్రో, షావోమీ 12 ప్రోలతో పోటీ పడనుంది.
టెక్నో ఫాంటం ఎక్స్2 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 3,499 సౌదీ అరేబియన్ రియాళ్లుగా (సుమారు రూ.76,700) నిర్ణయించారు. మార్స్ ఆరెంజ్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.
టెక్నో ఫాంటం ఎక్స్2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.8 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా దీని స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం హైపర్ఇంజిన్ 5.0 కూలింగ్ సిస్టం కూడా అందించారు.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. మరో 5 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను స్టోరేజ్ నుంచి పెంచుకోవచ్చు. వేపర్ చాంజర్ కూలింగ్ సిస్టం, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను టెక్నో ఫాంటం ఎక్స్2 ప్రోలో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ రిట్రాక్టబుల్ పొర్‌ట్రెయిట్ లెన్స్, మరో 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
Apple WWDC 2023: రూ.2.5 లక్షల వీఆర్ హెడ్‌సెట్, కొత్త ల్యాప్‌టాప్‌లు, ఐవోఎస్ 17 - యాపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ నేడే!
Nothing Phone 2: కొత్త ఫోన్‌తో రానున్న నథింగ్ - ఈసారి మరిన్ని స్పెషల్ ఫీచర్లు!
Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!
Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Mahesh Babu Goofy Pics : మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?