News
News
X

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో లాంచ్ చేయనున్న గెలాక్సీ ఎస్24 స్మార్ట్ ఫోన్‌లో వైఫై 7 ఫీచర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

వైఫై 7 కనెక్టివిటీ ఫీచర్‌తో లాంచ్ కానున్న మొదటి స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఫై 7 వెర్షన్‌తో వచ్చే స్మార్ట్ ఫోన్లు 2024 సెప్టెంబర్‌లో లాంచ్ అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు వైఫై 6, వైఫై 6ఈ వెర్షన్లతో వస్తున్నాయి. వైఫై 7 నెట్‌వర్కింగ్ ప్రో సిరీస్‌ను క్వాల్‌కాం ఈ సంవత్సరం మేలో లాంచ్ చేసింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైఫై 6 స్టాండర్డ్ కంటే 2.4 రెట్లు వేగంగా వైఫై 7 పని చేయనుంది. వైఫై 7 ద్వారా సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ లభించనుంది. వైఫై ఇన్నొవేషన్లకు దారి చూపడం, వినియోగ మార్గాలను పెంచడం వంటివి దీని ద్వారా సాధ్యం అవుతాయి. ఏఆర్/వీఆర్, 4కే, 8కే స్ట్రీమింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి లో లేటెన్సీ అవసరమైన పనులను సులభంగా చేసుకోవచ్చు.

ఫిజికల్, మీడియం యాక్సెస్ కంట్రోల్స్‌ను మెరుగుపరచడంపై వైఫై 7 ఫోకస్ పెట్టనుంది. 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్, 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రం బ్యాండ్లను వైఫై 7 సపోర్ట్ చేయనుంది. 6 నుంచి 16 స్ట్రీమ్‌ల రేంజ్‌ను ఇది ఆఫర్ చేయనుంది. క్వాల్‌కాం తెలుపుతున్న దాని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత స్కేలబుల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం పోర్ట్‌ఫోలియో వైఫై 7 కానుంది.

మీకు వైఫై స్లోగా వస్తుందా? అయితే ఈ టిప్స్ పాటించి దాని స్పీడ్ పెంచుకోండి.
1. కొన్నిసార్లు మనకి అవసరం లేని డివైస్‌లు కూడా వైఫైకి కనెక్ట్ అయి ఉంటాయి. వాటిని ముందు డిస్ కనెక్ట్ చేయాలి.
2. ఇంట్లో రూటర్‌ను ఎక్కడ పెట్టారో కూడా చూసుకోవాలి. గోడలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రూటర్‌ను దూరంగా ఉంచాలి.
3. ఒకవేళ మీరు డ్యూయల్ బ్యాండ్ రూటర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, రూటర్‌కు, మీకు మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి.
4. మీరు రూటర్‌కు దూరంగా ఉంటే 2.4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని, దగ్గరగా ఉంటే 5 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటే వైఫై స్పీడ్‌గా వస్తుంది.
4. రూటర్ యాంటెన్నాలను ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి.
5. రూటర్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. అప్పటికీ స్పీడ్ రాకపోతే ఎఫ్‌యూపీ చెక్ చేసుకుని, సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

News Reels

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Samsung India (@samsungindia)

Published at : 07 Oct 2022 03:25 PM (IST) Tags: Samsung New Phone Samsung Galaxy S24 WiFi 7 Samsung Galaxy S24 Samsung Galaxy S24 Features

సంబంధిత కథనాలు

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Vivo X90 Pro Plus: ఈ ఫోన్‌కు మార్కెట్లో పోటీనే లేదు - వన్‌ప్లస్ 11 సిరీస్ రావాల్సిందే!

Vivo X90 Pro Plus: ఈ ఫోన్‌కు మార్కెట్లో పోటీనే లేదు - వన్‌ప్లస్ 11 సిరీస్ రావాల్సిందే!

Vivo X90 Pro: ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - వివో ఎక్స్90 ప్రో వచ్చేసింది!

Vivo X90 Pro: ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - వివో ఎక్స్90 ప్రో వచ్చేసింది!

Vivo X90: వావ్ అనిపించే కెమెరాలో వివో ఎక్స్90 - వన్‌ప్లస్ 10, షావోమీ 12లకు గట్టిపోటీ!

Vivo X90: వావ్ అనిపించే కెమెరాలో వివో ఎక్స్90 - వన్‌ప్లస్ 10, షావోమీ 12లకు గట్టిపోటీ!

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?